Share News

ట్రంప్ దాడుల హెచ్చరికల వేళ.. పెంటగాన్ కీలక జనరల్‌పై వేటు

ABN , Publish Date - Oct 29 , 2026 | 04:55 PM

ఇరాన్‌పై ట్రంప్ మరోసారి దాడులకు సిద్ధమవుతున్న వేళ అగ్రరాజ్య రక్షణ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పెంటగాన్‌లో అత్యున్నత స్థాయి సైనిక వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ బ్రెట్ సిల్వియాను రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పదవి నుంచి తొలగించారు.

ట్రంప్ దాడుల హెచ్చరికల వేళ.. పెంటగాన్ కీలక జనరల్‌పై వేటు

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై ట్రంప్ మరోసారి దాడులకు సిద్ధమవుతున్న వేళ అగ్రరాజ్య రక్షణ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పెంటగాన్‌లో అత్యున్నత స్థాయి సైనిక వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ బ్రెట్ సిల్వియాను రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పదవి నుంచి తొలగించారు. ఈ విషయాన్ని బుధవారం రక్షణ శాఖకు సంబంధించిన ఓ అధికారి తెలిపారు. అయితే తొలగింపునకు గల కారణాలను ఉన్నతాధికారులు వెల్లడించలేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం సిల్వియా స్థానాన్ని భర్తీ చేయలేదని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులకు కాలు దువ్వుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.


సైనిక వ్యూహాల్లో కీలక బాధ్యతలు..

అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌లో వ్యూహాలు, ప్రణాళికలు, విధానాల విభాగానికి సిల్వియా నేతృత్వం వహించారు. దేశాధ్యక్షుడికి, జాయింట్ చీఫ్స్ చైర్మన్‌కు సైనిక వ్యూహాలకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించడం, సమన్వయం చేయడం ఈ విభాగం ప్రధాన బాధ్యత. సుమారు 32 ఏళ్ల సైనిక సేవా అనుభవం ఉన్న సిల్వియా గతంలో 101వ ఎయిర్‌బోర్న్ డివిజన్ కమాండర్‌గా పనిచేశారు. కాగా ఈ పదవి నుంచి తొలగింపునకు గురైన రెండో జనరల్‌గా ఆయన నిలిచారు. గతంలో ఈ బాధ్యతలు నిర్వహించిన జోసెఫ్ మెక్‌గీని కూడా పదవి నుంచి అమెరికా అధికారులు బలవంతంగా తప్పించారు.

ఇరాన్‌పై దాడులకు రంగం సిద్ధమవుతోందా?

ఇరాన్‌పై యుద్ధాన్ని ముగింపు దశకు తీసుకెళ్తామని ట్రంప్ గతంలో ప్రకటించారు. వచ్చే వారం జరిగే మధ్యంతర ఎన్నికల అనంతరం మరోసారి దాడులు చేపట్టే అవకాశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలోని అమెరికా మిత్రదేశాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించినట్లు సమాచారం.


ఈ వార్తలూ చదవండి

ట్రంప్ మద్దతుదారు ఫ్లేవియో బొల్సనారో ఎస్కేప్ ఎపిసోడ్.. సినిమా లెవల్‌లో ఉందిగా..!

ఎప్‌స్టీన్ ప్రస్తావన.. ట్రంప్‌ ఆసక్తికర సమాధానం..

Updated Date - Oct 29 , 2026 | 04:56 PM