Share News

ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రోడ్ల పరిస్థితిని బట్టి ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణ: మంత్రి మండిపల్లి

ABN , Publish Date - Oct 29 , 2026 | 12:59 PM

ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో నిలిచిన ఆర్టీసీ బస్సులను రోడ్ల పరిస్థితిని పరిశీలించిన అనంతరం పునరుద్ధరిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

ఆర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రోడ్ల పరిస్థితిని బట్టి ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణ: మంత్రి మండిపల్లి
Mandipalli Ramprasad Reddy

అమరావతి, అక్టోబర్ 29: ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో నిలిచిన ఆర్టీసీ బస్సులను రోడ్ల పరిస్థితిని పరిశీలించిన అనంతరం పునరుద్ధరిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు రవాణా సదుపాయాలను పునరుద్ధరించేందుకు ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ఇప్పటికే విజయవాడ నుంచి ఏలూరు, రాజమండ్రి వైపు బస్సు సర్వీసులు ప్రారంభమైనట్లు తెలిపారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.


తుఫాన్ ప్రభావం తగ్గి రోడ్లు సాధారణ స్థితిలో ఉన్న ప్రాంతాలలో ప్రయాణానికి అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించిన వెంటనే బస్సు సర్వీసుల కొనసాగించాలని మంత్రి ఆదేశించారు. బస్సుల పునరుద్ధరణపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. ఆర్టీసీ రవాణా వ్యవస్థను త్వరితగతిన సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు.


ఇవి కూడా చదవండి...

ఆర్నబ్ తుఫాన్ వేళ నిద్రాహారాలు మాని పనిచేశారు.. మంత్రి లోకేశ్ ప్రశంసలు

ఆర్నబ్ తుఫాన్‌పై అమిత్ షా సమీక్ష.. త్వరలోనే బాధిత రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 01:03 PM