Share News

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. నవంబర్‌లో ఏపీకి వర్ష సూచన

ABN , Publish Date - Oct 29 , 2026 | 12:32 PM

బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. నవంబర్‌లో ఏపీకి వర్ష సూచన
Andhra Pradesh Rain Alert

అమరావతి, అక్టోబర్ 29: బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడిందని... ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, ఆనుకుని ఉన్న అండమాన్ & నికోబార్ దీవులపై సుస్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఆ తదుపరి 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాలపై వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.


ఈ వాతావరణ ప్రభావంతో నవంబర్ 1, 2 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. రానున్న రోజుల్లో ఈ వాయుగుండం కదలికలు, దాని ప్రభావంపై మరింత స్పష్టత వస్తుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.


ఇవి కూడా చదవండి...

ఆర్నబ్ తుఫాన్ వేళ నిద్రాహారాలు మాని పనిచేశారు.. మంత్రి లోకేశ్ ప్రశంసలు

ఆర్నబ్ తుఫాన్‌పై అమిత్ షా సమీక్ష.. త్వరలోనే బాధిత రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 01:01 PM