Share News

‘నా కూతురిని నేనే చంపేశా’.. అత్యవసర నంబర్ 911కు తల్లి ఫోన్‌

ABN , Publish Date - Oct 17 , 2026 | 11:11 AM

న్యూయార్క్‌లో ఐదేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తన కూతురిని తానే చంపేశానంటూ తల్లి అత్యవసర నంబర్‌కు కాల్ చేశారు.

‘నా కూతురిని నేనే చంపేశా’.. అత్యవసర నంబర్ 911కు తల్లి ఫోన్‌

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ ఐదేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటనపై బాలిక తల్లి ఫ్రాన్సిస్‌ కాబెల్లోపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ.. ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 14న సాయంత్రం ఫ్రాన్సిస్‌.. ఎమర్జెన్సీ హెల్ప్‌ లైన్ నంబర్ 911కు కాల్ చేసి ‘నా కూతురిని నేనే చంపేశా’ అని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమె కూతురు ఓ గదిలో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని చూశారు. బాలిక ముక్కు, నోటి నుంచి రక్తస్రావం అవుతుండటంతో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే బాలిక మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.


కాగా.. ఫ్రాన్సిస్‌ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఆమె తండ్రి ఫ్రాంక్లిన్‌ కాబెల్లో తెలిపారు. సుమారు మూణ్నెల్ల కిందట ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందారని.. వైద్యులు సూచించిన మందులను ఇటీవలే ఆపేసినట్లు కూతురు చెప్పారన్నారు. దీంతో ఇటీవల ఆమె ప్రవర్తనలో మార్పులు కనిపించాయని, మళ్లీ మందులు వాడాలని తాను పలుమార్లు సూచించినట్లు పేర్కొన్నారు. అయితే.. ఆమె తన చిన్నారినే హతమారుస్తుందని అస్సలు ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి వివరాల మేరకు ఫ్రాన్సిస్‌కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఆ తర్వాత పోలీసులు ఆమెను విచారించినట్లు సమాచారం. బాలిక మృతిని హత్య కేసుగా పరిగణించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


ఇవీ చదవండి:

‘ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేయకపోతే ధ‌ర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక

ఢిల్లీలో నిరసనల వేళ.. అభిజీత్ దీప్కే అరెస్ట్.. నేహా బోరా విడుదల

Updated Date - Oct 17 , 2026 | 12:39 PM