Share News

వైద్యులు ప్రాణదాతలు..

ABN , Publish Date - Jul 01 , 2026 | 07:49 AM

వైద్యులు ప్రాణదాతలు. అర్థరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా వైద్య సేవలు అందజేస్తుంటారు.

వైద్యులు ప్రాణదాతలు..
National Doctors Day 2026

  • నేడు డాక్టర్స్‌ డే

  • ఆరోగ్య ప్రదాతలను గౌరవిస్తూ సన్మానాలు

  • దక్షిణమధ్య రైల్వే, సికింద్రాబాద్‌లో ఏర్పాట్లు

హైదరాబాద్: వైద్యులు ప్రాణదాతలు. అర్థరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా వైద్య సేవలు అందజేస్తుంటారు. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే వైద్యులు భగవంతుడితో సమానమని భావిస్తుంటారు. ప్రముఖ డాక్టర్‌, పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం డాక్టర్‌ బిదాన్‌ చంద్రరాయ్‌ జన్మనదినం పురస్కరించుకుని ఆయన అందజేసిన విశిష్ట వైద్య సేవలకు గుర్తింపుగా దేశవ్యాప్తంగా జూలె-ౖ1వ తేదీన డాక్టర్స్‌డేగా వ్యవహరిస్తారు.


సామాజిక సేవలో చురుగ్గా పాలుపంచుకుంటూ విశేష వైద్య సేవలు అందజేసిన అటువంటి డాక్టర్లను గౌరవిస్తూ, వారి సేవలను గుర్తు చేసుకుంటూ వారిని ఘనంగా సత్కరిస్తుంటారు. కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేసిన నేపథ్యంలో డాక్టర్లు అంటే గౌరవం పెరిగింది. వాతావరణంలో మార్పులు, ఆహారపు అలవాట్లు, సమయపాలన లేని పని గంటలతో వివిధ రకాల వ్యాధులు ప్రబలుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.


మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని క్రమం తప్పకుండా నడక, తేలికపాటి వ్యాయామం, యోగా వంటి వాటితో ఆరోగ్యం పరిరక్షించుకోవచ్చునని చెబుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్‌లో డాక్టర్స్‌-డేను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆల్‌ ఇండియా రైల్వే పెన్షనర్‌ వెల్ఫేర్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదిర్శి పి.యుగంధర్‌ తెలిపారు. వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తూ వైద్య సేవలు అందజేస్తున్న డాక్టర్లను గౌరవించి ఘనంగా సత్కరించడానికి ఏర్పాట్లు గావిస్తున్నట్ల్లు తెలిపారు.


city2.jpgసీనియర్‌ సిటిజన్స్‌ అప్రమత్తంగా ఉండాలి

సినీయర్‌ సిటిజన్స్‌ నడక తేలికపాటి, వ్యాయామాలు, యోగా వంటివి పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. హఠాత్తుగా పక్క మీద నుంచి లేవవద్దు. నిద్ర లేచిన తర్వాత కొద్దిసేపు ఆగి మెల్లగా పనులు ప్రారంభించాలి.

  • డాక్టర్‌. సారయ్య, జనరల్‌ సర్జన్‌


మహిళలు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి

మహిళలు తరచూ వైద్యపరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యం పరిరక్షించుకోవాలి. కనీసం ఏడాదికి ఒకసారి వైద్యపరీక్షలు చేయించుకుని ఎటువంటి జబ్బు లేదని నిర్ధారించుకోవాలి. ప్రాథమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్‌ను తేలికగా నయం చేయవచ్చు.

  • డాక్టర్‌ పద్మావతి, గైనకాలజిస్ట్‌


ప్రాథమిక దశలో క్యాన్సర్‌ను గుర్తిస్తే నివారణ సులభం

ఆహారపు అలవాట్లు, పొగ తాగడం వంటి అలవాట్ల వల్ల ఈ వ్యాధి సోకే ప్రమాదముంది. ప్రాథమిక దీనిని దశలో గుర్తిస్తే నివారణ సులభమవుతుంది.

  • డాక్టర్‌.రాగమహిత, డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌


ఈ వార్తలు కూడా చదవండి:

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే.

ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకునే క్రమంలో పోలీసుల ఫైరింగ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 01 , 2026 | 07:49 AM