హైదరాబాద్‌లో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు..
ABN , Publish Date - Feb 07 , 2026 | 06:46 AM
బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 11కేవీ ఐఓఏ, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్.22 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.
హైదరాబాద్: బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 11కేవీ ఐఓఏ, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్.22 ఫీడర్ల పరిధి, ఉదయం 10 గంటల నుంచి మ ధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ జూబ్లీహిల్స్ ఎన్ క్లేవ్, ప్లీజెంట్ వ్యాలీ, పోలీస్ లైన్స్ ఫీడర్ల పరిధి, ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు 11కేవీ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్.36 ఎంసీఆర్డీ ఫీడర్ల పరిధి,మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ గాయత్రి హిల్స్ ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలో..
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ భరత్ నగర్, అల్లావుద్దీన్ కోఠి ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
చిక్కడపల్లి: ఆజామాబాద్ డివిజన్, హైదరా బాద్ సిటీ-2 పరిధిలో శనివారం విద్యుత్ సరఫరా ఉండదని సీబీడీఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి.వినోద్‌కుమార్ తెలిపారు. బౌద్ధనగర్, జామైఉస్మానియా రోడ్, గుల్షన్‌నగర్, భోలక్‌పూర్ పరిధిలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, మూన్‌కేఫ్, శంకరమఠం మార్కెట్, మౌలానా ఆజాద్‌నగర్, చప్పల్ బజార్, తాళ్లబస్తీ పరిధిలో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు.
కాప్రా: చెట్ల కొమ్మల తొలగింపు కార ణంగా కైలాసగిరి ఫీడర్‌లోని హెచ్‌బీ కాలనీ, కైలాసగిరి, లక్ష్మీనగర్, భక్షిగూడ, ఇందిరానగర్, నవోదయనగర్, రాజీవ్‌నగర్, చైతన్యనగర్ పరిసర ప్రాంతాలలో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా ఉండదని మౌలాలి సబ్ స్టేషన్ ఏఈ వెంకట్ రెడ్డి తెలిపారు.
వాజ్‌పాయ్ నగర్ సబ్‌స్టేషన్ పరిధిలో..
నేరేడ్‌మెట్: నేరేడ్‌మెట్ వాజ్‌పాయ్ నగర్ సబ్‌స్టేషన్ పరిధిలోని ఆఫీసర్స్ కాలనీ 11 కేవీ పీటర్ పరిధిలో ఈ క్రింది ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ లత తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆఫీసర్స్ కాలనీ, కాకతీయ నగర్, గీతా నగర్, వెంకటేశ్వర నగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వివేకానంద పురం, భరణి కాలనీ, రాఘవేంద్ర నగర్, అమ్మ గూడ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు. ఉదయం 11 నుంచి 11:30 గంటల వరకు ఆర్కే హెచ్ కాలనీ సాయి నగర్ జేకే కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
కుషాయిగూడలో..
కుషాయిగూడ: చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు వాసవీ శివనగర్ ఫీడర్ పరిధిలోని వాసవీ శివ సాయి నగర్, వైష్ణవి ఎన్‌క్లేవ్, సోనియా గాంధీ నగర్, గణేష్ నగర్, మారుతీ ఎన్‌క్లేవ్, శివసాయి నగర్, సామ్రాట్ నగర్, శుభోదయ కాలనీ, లక్ష్మీ నరసింహ కాలనీ, నాగార్జున నగర్ కాలనీలలో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఏఈ టి.బాల్‌రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.
చర్లపల్లి సబ్‌స్టేషన్ పరిధిలో
చర్లపల్లి సబ్‌స్టేషన్-4 సాయి నగర్ పరిధిలోని ఎంఆర్‌ఆర్ కాలనీ, సుభాష్ నగర్, సాయి నగర్, నాగార్జున నగర్, శ్రీరాం బేకరీ, చక్రిపురం చౌరస్తాలలో మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు కరెంటు సరఫరా ఉండదని తెలిపారు.
- అంబేడ్కర్ నగర్ ఫీడర్ పరిధిలోని చిన్న చర్లపల్లి, చర్చి కాలనీ, సిల్వర్ ఓక్ విల్లాస్, రాజీవ్ గృహకల్ప, వి.ఆర్ కాలనీ, విద్యా మారుతీనగర్, అంబేడ్కర్ నగర్, లక్ష్మీ నగర్, నేతాజీ నగర్, డీసీ కాలనీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ ఏ.బాబూరావు ఒక ప్రకటనలో తెలిపారు.
జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఫీడర్ పరిధిలో...
జేఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఫీడర్ పరిధిలోని ఈసీ నగర్, మహాలక్ష్మీ నగర్, మింట్ కాలనీ, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు సరఫరా ఉండదని వెల్లడించారు.
జవహర్‌నగర్ డివిజన్‌లో..
బిట్స్ పిలానీ: జవహర్‌నగర్ డివిజన్‌లోని 11 కేవీ మహంకాళి, శివాజీ నగర్ ఫీడర్ పరిధిలో రోడ్డు మరమ్మతులు, విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ ఏఈ సాంబశివరావు తెలిపారు. మున్సిపల్ ఆఫీసర్, శివాజీనగర్, మహంకాళి కమాన్, శ్రీరామ్‌నగర్ మార్వాడి లైన్, జ్యోతి కాలనీ, భజరంగ్‌నగర్ కాలనీ, సీసీఐ కాలనీ, కేసీఆర్ కూరగాయాల మార్కెట్ సంతోష్ నగర్, సుక్కమ్మకుంట, విగ్నేశ్వర కాలనీ, భద్రయ్య వెంచర్, సుభద్రమ్మ కాలనీ, వీకేఎన్ క్లేవ్, కళ్యాణ్ సులోచన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
బోడుప్పల్, ఇంద్రానగర్ పరిధిలో..
ఉప్పల్: చెట్ల కొమ్మల తొలగింపు, డీసీ పనుల నేపథ్యంలో శనివారం బోడుప్పల్, ఇంద్రానగర్ పరిధిలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు బోడుప్పల్ విద్యుత్ ఏఈ ఎన్.వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బోడుప్పల్ సబ్ స్టేషన్ ఉదయనగర్ ఫీడర్‌లోని ఈస్ట్ బృందావన్ కాలనీ, వెస్ట్ బృందావన్ కాలనీ, శ్రీనివాస కాలనీ, సతీ రెడ్డి కాలనీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ నిలిపేయనున్నామని పేర్కొన్నారు.. ఇంద్రానగర్ సబ్ స్టేషన్ వివేకానంద ఫీడర్‌లోని మణికంఠనగర్, వివేకానంద నగర్, శ్రీలక్ష్మి నగర్, లెక్చరర్స్ కాలనీ, ఐఐసీటీ కాలనీ, భీం రెడ్డి కాలనీ, అశోక్ నగర్, గ్రీన్ సిటీ కాలనీ, అనగాపురి కాలనీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంట్ ఉండదని వివరించారు. అదేవిధంగా ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు ఇంద్రానగర్ సబ్ స్టేషన్ బొల్లిగూడెం ఫీడర్‌లోని బొల్లిగూడెం, అంజయ్య ఎన్‌క్లేవ్, అమ్మసాని వెంకట్ రెడ్డి కాలనీ, ఎస్‌బీఆర్ కాలనీ, టెలిఫోన్ కాలనీ, తజలింగం కాలనీ (ఫేజ్-1), రాజలింగం కాలనీ (ఫేజ్-2), సూరజ్ నగర్, మహాలక్ష్మి నగర్, బాలాజీ నగర్, లక్ష్మారెడ్డి నగర్, హుడా లక్ష్మి నగర్, కేశవ్ నగర్, ఆకృతి టౌన్‌షిప్, ఎన్టీఆర్ స్టాచ్యూ రోడ్‌లో విద్యుత్ తీసేస్తామని వెల్లడించారు.
బౌద్ధనగర్: వివిధ మరమ్మతుల కారణంగా అజామాబాద్ విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయం పరిధిలో శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏడీఈ నాగేశ్వరరావు, ఏఈ రోచిత తెలిపారు. బౌద్ధనగర్ ఫీడర్ పరిధిలో కౌసర్‌మసీద్, సంజయ్‌గాంధీనగర్, బీజేపీ ఆఫీ్‌సలేన్, వారాసిగూడ, బౌద్ధనగర్, కనకదుర్గ ఆలయం ఏరియా, మోర్ సూపర్‌మార్కెట్, జామైఉస్మానియా, ఎల్.ఎన్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 10నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని తెలిపారు. మూన్‌కేఫ్, శంకర్‌మఠం మార్కెట్, మౌలానా అజాద్‌నగర్, చప్పల్‌బజార్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్‌సరఫరా నిలిపివేయబడుతుందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
లంచం తీసుకుని.. తిరుమలకు నెయ్యి ట్యాంకర్ల అనుమతి!
చెడు పదార్థాలు కలిపి స్వామికి తినిపించారు
Read Latest Telangana News and National News