Share News

వానల్లో... ఆరోగ్యంగా...

ABN , Publish Date - Jul 19 , 2026 | 10:54 AM

వానాకాలం మొదలయ్యిందంటే... ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా వైరల్‌ జ్వరాలు, జలుబు, దగ్గు, జీర్ణసమస్యలతో సతమతమవు తుంటారు చాలామంది.

వానల్లో... ఆరోగ్యంగా...
Rains, Health

వానాకాలం మొదలయ్యిందంటే... ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా వైరల్‌ జ్వరాలు, జలుబు, దగ్గు, జీర్ణసమస్యలతో సతమతమవు తుంటారు చాలామంది. అస్తమానం అన్నింటికీ మాత్రలే అంటే ఎలా? కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటించడం, జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా ఉపశమనం పొందొచ్చంటున్నారు వైద్య నిపుణులు. అవేమిటంటే...

  • ఉదయం నిద్రలేవగానే గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగాలి. ఈ సాధారణ అలవాటు శరీరంలో నుంచి విషపదార్థాలు (టాక్సిన్స్‌) బయటకు పంపేందుకు సహాయ పడుతుంది. దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రుచి కోసం కొంచెం తేనె కలుపుకోవచ్చు.

  • ఉదయం రెండు నిమిషాల పాటు ప్రాణాయామం చేయాలి. శ్వాసపై ఏకాగ్రత నిలపాలి. దీనివల్ల శరీరానికి తగిన విశ్రాంతి లభిస్తుంది. రీఫ్రెష్‌ కావడానికి ఇది మంచి మార్గం. సంప్రదాయ ఆయుర్వేదంలో ప్రాణాయా మానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.


zz.jpg

  • అల్లం, తులసి, నల్లమిరి యాలు వేసి తయారుచేసిన గోరువెచ్చని హెర్బల్‌ డ్రింక్‌ తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు. వర్షాకాలంలో వైరల్‌ జ్వరాల బారినపడకుండా ఉండటానికి, రోగనిరోధక శక్తి పెంచుకోవ డానికి ఇది ఎంతో ఉపకరిస్తుంది.


book5.3.jpg

  • నువ్వుల నూనెతో పావుగంట పాటు శరీరాన్ని మర్దన చేసు కోవాలి. పిండతైలం కూడా మర్దనకు వాడొచ్చు. మర్దన వల్ల రక్తసరఫరా మెరుగుపడుతుంది. కీళ్లు బిగుసు కుపోకుండా ఉపశమనం కలుగుతుంది. మర్దన తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. వారానికి ఒకసారైనా తైల మర్దన చేసుకోవాలి.

  • వర్షాకాలంలో తేమ వల్ల ఫంగల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. అందుకే చర్మాన్ని తడిలేకుండా చూసుకోవాలి. వర్షంలో తడిస్తే వెంటనే వేడి నీళ్లతో స్నానం చేసి తడి లేకుండా తుడుచుకోవాలి.


book5.4.jpg

  • ఈ సీజన్‌లో వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకో వాలి. అలాగే సీజనల్‌ ఫ్రూట్స్‌ తప్పనిసరిగా తినాలి. పియర్స్‌, ఆపిల్స్‌, దానిమ్మ వంటివి చాలా మంచివి. ఉడికించని కూరగాయలు, సలాడ్స్‌కి దూరంగా ఉండాలి. స్ట్రీట్‌ఫుడ్‌, ఫ్రైడ్‌ఫుడ్‌ వీలైనంతమేర తగ్గించాలి.

  • వర్షాకాలంలో వాతం పెరుగుతుంది. ఫలితంగా చర్మం పొడిబారడం, జలుబు, కీళ్ల కదలికలు తగ్గిపోతాయి. కడుపు ఉబ్బరం పెరుగుతుంది. తేనె కలిపిన అల్లం జ్యూస్‌ తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. గ్లాసు గోరువెచ్చటి నీటిలో చిటికెడు ఇంగువ వేసుకుని తాగినా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

  • ఈ సీజన్‌లో పగటి నిద్ర మంచిది కాదు. దీనివల్ల జీవక్రియలు నెమ్మదిస్తాయి. బద్దకం పెరుగుతుంది. కాబట్టి మధ్యాహ్నం నిద్ర దరిచేర కుండా ఏదైనా వ్యాపకంలో మునిగిపోవాలి.


ఈ వార్తలు కూడా చదవండి:

నిషేధిత జాబితా నుంచి ప్రైవేటు ఆస్తులను తొలగించాలి

కోట్లు కొల్లగొట్టిన ఆ దంపతులు అదుపులో?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 19 , 2026 | 11:39 AM