అమెరికా సైనికుల మృతి.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు
ABN , Publish Date - Jul 19 , 2026 | 10:13 AM
ఇరాన్ దాడిలో తమ సైనికులు ఇద్దరు మరణించడంతో అమెరికా ఆదివారం ప్రతీకార దాడులకు దిగింది. ఈ విషయాన్ని సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ దాడిలో తమ సైనికులు ఇద్దరు మరణించడంతో అమెరికా ఆదివారం ప్రతీకార దాడులకు దిగింది. ఈ విషయాన్ని సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ట్రంప్ ఆదేశాల మేరకు ఈ దాడులు చేశామని సెంట్రల్ కమాండ్ తెలిపింది. హోర్ముజ్‌లో కమర్షియల్ నౌకల రాకపోకలకు అడ్డంకులు సృష్టిస్తున్న ఇరాన్‌ను మరింత బలహీన పరిచేలా ఈ దాడులు చేసినట్టు తెలిపింది. ఇరాన్‌పై వరుసగా తాము ఎనిమిదో రోజూ దాడి చేశామని చెప్పింది. తీర ప్రాంతంలో ఇరాన్ నిఘా వ్యవస్థలు, మిసైల్, డ్రోన్ నిల్వ కేంద్రాలను టార్గెట్ చేశామని తెలిపింది. జులై 17న జోర్డాన్‌ను టార్గెట్ చేసిన సైనిక దళం ఇరాన్ రివల్యూషనరీ గార్డులనూ టార్గెట్ చేశామని సెంట్రల్ కమాండ్ తెలిపింది.
జోర్డాన్‌పై శుక్రవారం ఇరాన్ జరిపిన మిసైల్ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇరాన్ మిసైల్స్‌ను అడ్డుకునే ప్రయత్నంలో వారు కన్నుమూసినట్టు అమెరికా పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి మరో సైనికుడి జాడ ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొంది. ఇక ఈ ఘటనలో గాయపడ్డ వారిని ఆసుపత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్టు పేర్కొంది. ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధంలో ఇప్పటివరకూ 16 మంది మిలిటరీ సిబ్బంది మరణించారని కూడా యూఎస్ ధ్రువీకరించింది.
ఈ వార్తలనూ చదవండి:
గల్ఫ్ ఉద్రిక్తతలు.. ఇక పూర్తిస్థాయి యుద్ధం
బీఎల్‌ఏ దాడిలో 45 మంది పాక్ సైనికుల హతం