Share News

బీఎల్‌ఏ దాడిలో 45 మంది పాక్‌ సైనికుల హతం

ABN , Publish Date - Jul 19 , 2026 | 06:23 AM

బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) మరోసారి పాకిస్థాన్‌ సైన్యమే లక్ష్యంగా దాడులు చేసింది. సెలవుపై ఉన్న సైనికులను పది బస్సుల్లో...

బీఎల్‌ఏ దాడిలో 45 మంది పాక్‌ సైనికుల హతం

  • మిలటరీ వాహన శ్రేణిపై కాల్పులు

  • సాయానికివచ్చిన అంబులెన్స్‌లపైనా..

ఇస్లామాబాద్‌, జూలై 18: బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) మరోసారి పాకిస్థాన్‌ సైన్యమే లక్ష్యంగా దాడులు చేసింది. సెలవుపై ఉన్న సైనికులను పది బస్సుల్లో తీసుకెళ్తుండగా బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని మస్తుంగ్‌ జిల్లాలో గురువారం వాటిపై గురిపెట్టి కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 45 మందికిపైగా పాక్‌ సైనికులు ప్రాణాలు కోల్పోగా, పెద్దసంఖ్యలోనే గాయపడ్డారు. ఇది తమ ఫతా స్క్వాడ్‌ పనేనని బీఎల్‌ఏ అధికార ప్రతినిధి జీయాంద్‌ బలూచ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వాహన శ్రేణితో పాటు, అనంతరం వారిని ఆదుకోవడానికి వచ్చిన సిబ్బందిపైనా దాడులు చేసినట్టు అంగీకరించారు. గాయపడ్డ సైనికులను తీసుకెళ్లడానికి వచ్చిన అంబులెన్స్‌లపైనా దాడులు చేశారు. పాక్‌ సైన్యం మాత్రం మృతి చెందిన సైనికుల సంఖ్యను ఇంకా ధ్రువీకరించలేదు. ఈ దాడి అనంతరం పాక్‌ ప్రభుత్వం అప్రమత్తమయింది. హెలికాప్టర్‌ గన్‌షి్‌పలలో అదనపు సైనికులను, ఆయుధాలను పంపించింది. వైద్య సహాయం అందించే నిమిత్తం క్వెట్టా సహా ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఖడ్‌కోచా ప్రాంతంలో శుక్రవారం రాత్రి వరకు కూడా బీఎల్‌ఏ, సైన్యం మధ్య కాల్పులు కొనసాగాయి.

ఇవి కూడా చదవండి

దేశ అంతరిక్ష కలలకు చిరునామాగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

గంజాయి పండిస్తున్న సాధువు.. అరెస్ట్ చేసిన పోలీసులు

Updated Date - Jul 19 , 2026 | 06:23 AM