Share News

దేశ అంతరిక్ష కలలకు చిరునామాగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Jul 18 , 2026 | 02:57 PM

భారత్ తొలి ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగం ‘విక్రమ్-1’ విజయవంతంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ‘హైదరాబాద్ రైజింగ్.. తెలంగాణ రైజింగ్' అంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.

దేశ అంతరిక్ష కలలకు చిరునామాగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy

హైదాబాద్, జులై 18: భారత్ తొలి ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగం ‘విక్రమ్-1’ విజయవంతంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ‘హైదరాబాద్ రైజింగ్.. తెలంగాణ రైజింగ్' అంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. భారత్ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' విజయవంతమైన ప్రయోగమన్నారు. శ్రీహరికోట నుంచి విక్రమ్-1 నింగిలోకి దూసుకెళ్లిందని, హైదరాబాద్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ఘన విజయం సాధించిందని తెలిపారు. భారత అంతరిక్ష రంగం మరో చారిత్రక మైలురాయిని చేరుకుందన్నారు.


దేశ అంతరిక్ష కలలకు చిరునామాగా తెలంగాణ నిలిచిందని సీఎం అన్నారు. హైదరాబాద్ ఇన్నోవేషన్ శక్తికి ప్రపంచ వేదికపై గుర్తింపు లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా స్కైరూట్ బృందానికి ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. విక్రమ్-1.. ప్రైవేట్ స్పేస్ రంగంలో భారత్ సత్తా చాటిందని కొనియాడారు. భవిష్యత్తు అంతరిక్ష ప్రయాణాలకు తెలంగాణ నుంచి బలమైన అడుగు పడిందని ఎక్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

ఆయిల్ పామ్ రైతుల కోసం దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వాలి: మంత్రి తుమ్మల

ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. రేవంత్‌కు కేటీఆర్ వార్న్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 18 , 2026 | 03:45 PM