ఆయిల్ పామ్ రైతుల కోసం దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వాలి: మంత్రి తుమ్మల
ABN , Publish Date - Jul 18 , 2026 | 01:04 PM
కేంద్రంపై సంయుక్త ఒత్తిడికి దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఆయిల్ పామ్ రైతుల కోసం దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వాలని కోరారు.
హైదరాబాద్, జులై 18: కేంద్రంపై సంయుక్త ఒత్తిడికి దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఆయిల్ పామ్ రైతుల కోసం దక్షిణాది రాష్ట్రాలు ఏకమవ్వాలని కోరారు. ప్రధాని మోదీని కలిసి ఆయిల్ పామ్ రైతుల సమస్యలు వినిపిద్దామన్నారు. ఆయిల్ పామ్‌కు కనీస హామీ ధర రూ.25 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. లేదంటే క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పునరుద్ధరించాలన్నారు.
దిగుమతి సుంకాల తగ్గింపుతో రైతులకు భారీ నష్టం వాటిల్లుతోందని మంత్రి తెలిపారు. దేశ ఆయిల్ పామ్ సాగులో 75 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాలదే అని చెప్పుకొచ్చారు. రైతులకు స్థిర ఆదాయం కోసం కేంద్రం తక్షణ జోక్యం అవసరమన్నారు. వంటనూనెల స్వయం సమృద్ధి లక్ష్యానికి రైతుల రక్షణ కీలకమన్నారు. ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాల కోసం దక్షిణాది రాష్ట్రాలు కలిసిరావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
ఫాల్కన్ సీఎండీ అమర్‌దీప్ కుమార్‌ను అరెస్ట్ చేసిన ఈడీ
రంగు కలిపిన చికెన్, వాడిన నూనెలతో వంటలు.. హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ రైడ్
Read Latest Telangana News And Telugu News