Share News

ఫాల్కన్ సీఎండీ అమర్‌దీప్ కుమార్‌‌ను అరెస్ట్ చేసిన ఈడీ

ABN , Publish Date - Jul 18 , 2026 | 11:37 AM

ఫాల్కన్ గ్రూప్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫాల్కన్ సీఎండీ అమర్‌దీప్ కుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు.

ఫాల్కన్ సీఎండీ అమర్‌దీప్ కుమార్‌‌ను అరెస్ట్ చేసిన ఈడీ
Falcon CMD Arrest

హైదరాబాద్, జులై 18: ఫాల్కన్ గ్రూప్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫాల్కన్ సీఎండీ అమర్‌దీప్ కుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి అమర్‌దీప్‌ అరెస్ట్‌ను చూపించారు అధికారులు. అనంతరం ఫాల్కన్ సీఎండీని న్యాయస్థానంలో హాజరుపరచగా.. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అధికారులు అమర్‌దీప్‌ను చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు.


ఫాల్కన్ సంస్థ.. పెట్టుబడిదారులకు 11 శాతం నుంచి 21 శాతం వరకు అధిక లాభాలు ఇస్తామని హామీ ఇచ్చి భారీగా నిధులు సమీకరించినట్లు ఈడీ గుర్తించింది. మొత్తం రూ.4,215 కోట్ల మేర పెట్టుబడులు సేకరించినట్లు వెల్లడించింది. కొత్త పెట్టుబడిదారుల నుంచి వచ్చిన డబ్బుతో పాత పెట్టుబడిదారులకు చెల్లింపులు చేసినట్లు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ గుర్తించింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు రూ.792 కోట్లను నేర ఆదాయంగా (Proceeds of Crime) గుర్తించినట్లు తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో రంగారెడ్డి జిల్లాలోని ఆస్తులతో పాటు హాకర్ 800A విమానం సహా రూ.20.6 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. విచారణకు సహకరించకపోవడంతో PMLA సెక్షన్-19 కింద అమర్‌దీప్ కుమార్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఫాల్కన్ మనీలాండరింగ్ కేసులో నిధుల మళ్లింపు, ఇతర నిందితుల పాత్రపైనా ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి..

ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. డీజే ప్లేయర్‌పై కేసు నమోదు

నల్లగొండలో కలకలం: వైద్య విద్యార్థిని, యువకుడి అనుమానాస్పద మృతి..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 18 , 2026 | 12:11 PM