సీదిరి అప్పలరాజు కుమారుడి కేసు.. కాశీబుగ్గ పోలీసులపై చర్యలు
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:11 PM
వైసీపీ నేత, మాజీమంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్ కేసులో కాశీబుగ్గ పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. విధుల్లో అలసత్వం, నిందితులకు సహకరించారన్న ఆరోపణలతో ఇద్దరు పోలీసులపై వేటు పడింది.
శ్రీకాకుళం, జులై 18: వైసీపీ నేత, మాజీమంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు హిట్ అండ్ రన్ కేసులో కాశీబుగ్గ పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. విధుల్లో అలసత్వం, నిందితులకు సహకరించారన్న ఆరోపణలతో ఇద్దరు పోలీసులపై వేటు పడింది. కాశీబుగ్గ సీఐ రామకృష్ణను ఉన్నతాధికారులు వీఆర్‌కు పంపించారు. ఇప్పటికే ఎస్‌ఐ సునీల్‌ను వీఆర్‌కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. మొదటి నుంచి కాశీబుగ్గ పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డు ప్రమాద కేసులో సాక్ష్యులను తారుమారు చేయటంలో కాశీబుగ్గ పోలీసుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
నల్లగొండలో కలకలం: వైద్య విద్యార్థిని, యువకుడి అనుమానాస్పద మృతి..
గిరిపురంలో అతిసారానికి నీటి కలుషితమే కారణమని భావిస్తున్నాం: డీఎంహెచ్‌ఓ
Read Latest AP News And Telugu News