రంగు కలిపిన చికెన్, వాడిన నూనెలతో వంటలు.. హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ రైడ్
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:27 PM
హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై H-FAST అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. చాంద్రాయణగుట్టలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు.
హైదరాబాద్, జులై 18: నగరంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై H-FAST అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. చాంద్రాయణగుట్టలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. అల్-మదీనా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఒమెర్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో తనిఖీలు చేయగా.. అపరిశుభ్ర పరిస్థితుల్లో ఆహారం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో రెండు కేసులు నమోదు చేసిన అధికారులు.. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వాడిన వంట నూనెను తిరిగి వినియోగిస్తున్నారని, కృత్రిమ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే పెస్ట్ కంట్రోల్ రికార్డులు, వాటర్ అనాలిసిస్ సర్టిఫికెట్లు లేనట్లు తనిఖీల్లో బయటపడింది. సుమారు 20 లీటర్ల రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్, 10 లీటర్ల ఫ్రెష్ కుకింగ్ ఆయిల్‌ను సీజ్ చేశారు. సుమారు 40 కిలోల ఫ్రైడ్ చికెన్‌తో పాటు 40 కిలోల రంగు కలిపిన రా చికెన్‌ను అధికారులు సీజ్ చేశారు. 3 బాక్సులు, 6 ప్యాకెట్ల ఆర్టిఫిషియల్, సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను హెచ్‌ఫాస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితులను, సీజ్ చేసిన సామగ్రిని చాంద్రాయణగుట్ట పోలీసులకు అధికారులు అప్పగించారు.
ఇవి కూడా చదవండి..
నల్లగొండలో కలకలం: వైద్య విద్యార్థిని, యువకుడి అనుమానాస్పద మృతి..
ఫాల్కన్ సీఎండీ అమర్‌దీప్ కుమార్‌ను అరెస్ట్ చేసిన ఈడీ
Read Latest Telangana News And Telugu News