Share News

నిషేధిత జాబితా నుంచి ప్రైవేటు ఆస్తులను తొలగించాలి

ABN , Publish Date - Jul 19 , 2026 | 06:30 AM

రాష్ట్రంలో నిషేధిత జాబితా నుంచి ప్రైవేటు ఆస్తులను వెంటనే తొలగించాలని తెలంగాణ రియల్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

నిషేధిత జాబితా నుంచి ప్రైవేటు ఆస్తులను తొలగించాలి

  • సీఎం రేవంత్‌కు తెలంగాణ రియల్టర్స్‌ అసోసియేషన్‌ లేఖ

హైదరాబాద్‌ సిటీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిషేధిత జాబితా నుంచి ప్రైవేటు ఆస్తులను వెంటనే తొలగించాలని తెలంగాణ రియల్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి శనివారం లేఖ రాసిన్నట్లు అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు మేకపోతుల నరసయ్య, ప్రధాన కార్యదర్శి పడగాల రంగారావు తెలిపారు. ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడంతో 3 నెలలుగా ప్రజలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ప్లాట్లపై బ్యాంకులు రుణాలు మంజూరు చేసినప్పటికీ రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో ఆ రుణాలు రద్దవుతున్నాయని తెలిపారు.

Updated Date - Jul 19 , 2026 | 06:31 AM