ఆపదలో ప్రాణదాతగా ప్రథమ చికిత్స
ABN , Publish Date - Sep 12 , 2026 | 10:08 AM
రోడ్డు ప్రమాదం జరిగినా.. అనుకోకుండా అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణిస్తే అత్యవసర వైద్యం అందించే ముందు ఇచ్చే ప్రాథమిక సహాయమే ప్రథమ చికిత్స.
భయంతో కాదు.. నమ్మకంతో సహాయం చేద్దాం
నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం
హైదరాబాద్: రోడ్డు ప్రమాదం జరిగినా.. అనుకోకుండా అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణిస్తే అత్యవసర వైద్యం అందించే ముందు ఇచ్చే ప్రాథమిక సహాయమే ప్రథమ చికిత్స. సరైన సమయంలో అందించే చిన్న చికిత్స మనిషి ప్రాణాలను కాపాడుతుందనడంలో సందేహం లేదు. ప్రతి సంవత్సరం సెప్టెంబరు రెండవ శనివారం ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇంటి నుంచి ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనులపై బయటకు వెళ్లిన భర్త, ఇతర బంధువులు ఇంటికి వచ్చే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి. సరైన వ్యాయామాలు, సక్రమంగా తినకపోవడం వల్ల ఎన్నో అనారోగ్యాలు అకస్మాత్తుగా వస్తు న్నాయి. ప్రస్తుతం ప్రజల్లో ప్రథమ చికిత్సపై అవగాహన పెంచడం, అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడే నైపుణ్యతను పెంపొందిం చడం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి.
చట్టంతో భయం లేదు
మనకు ఎన్నో సార్లు రోడ్లపై ప్రయాణించే సమయంలో ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాదానికి గురైన వారికి సహాయం చేసేందుకు ఎంతో మంది పోలీస్ కేసుల భయం, కోర్టుల మెట్లు ఎక్కాలనే భయంతో ముందుకు రారు. ఇలాంటి వారి కోసం (గుడ్ సమరిటన్ లా)మార్గదర్శకాలను అమలులోకి తీసుకువచ్చినట్లు సమాచారం. ప్రమాద బాధితులను ఆస్పత్రికి చేర్చిన వ్యక్తి తన సొంత వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేదు. సహాయం చేసిన వారే సాక్షిగా ఉండాలని పోలీసులు బలవంతం చేయరు. సాక్షం చెప్పాలంటే సహాయం చేసిన వారు ఎంచుకున్న ప్రాంతంలోనే వివరాలను చెప్పవచ్చు.
ఆస్పత్రుల వారు చేర్పించిన వారిని డబ్బులు కట్టాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయొచ్చు. ఆస్పత్రిలో చేర్పించినా.. ఏమైనా జరిగితే సహకరించిన వారిపై కేసులు చేయొద్దనే నిబంధనలున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తొలి గంటను గోల్డెన్ అవర్ అని, ఆ సమయంలో అందించే చిన్న సాయం ఒక కుటుంబ పెద్దను కాపాడి ఆ కుటుంబాన్ని నిలబెడుతుంది. చట్టపరమైన సహాయాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉన్నందున ఆపదలో ఉన్న వారికి ప్రథమ చికిత్స చేసి ప్రాణదాతలుగా నిలుద్దామని ఆశిస్తున్నాం.
ఏదైనా ప్రమాదం జరిగితే..
మనం రోడ్డుపై ప్రయాణించే సమయంలో ఎవరికైనా ప్రమాదం జరి గినా, ఎవరైనా అనుకోకుండా అనారోగ్యంతో పడిపోయినా మనం శాంతం గా ఉండి అక్కడున్న పరిస్థితిని గుర్తించాలి. అత్యవసర నెంబర్ 108,100 పోలీసులకు సమాచారం అందించాలి. బాధితులు శ్వాస, గుండె పని చేసే విధానాలు, రక్త ప్రసరణ, శ్వాస తీసుకోవడాన్ని పరిశీలించాలి. అవసరమైతే సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడొచ్చు. గాయాలైన సమయంలో రక్తం కారడాన్ని ఒక వస్త్రంతో ఆ ప్రాంతంలో గట్టిగా నొక్కి పట్టాలి. వెన్నెముకలు, ఎముకలు విరిగిపోయినట్లు అనిపిస్తే వారిని అటూ.. ఇటు కదిలించవద్దు.
ఆదర్శంగా ఓ ట్రాఫిక్ మార్షల్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంకు చెందిన ఓ వ్యక్తి(55) గత ఆరు నెలల క్రితం నడుచుకుంటూ వెళ్తూ సూరారం సిగ్నల్ వద్ద స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న జీడిమెట్ల ట్రాఫిక్ మార్షల్ శివకుమార్‌యాదవ్ అతడికి సీపీఆర్ చేశాడు. 2 నిమిషాల పాటు సీపీఆర్ చేయడంతో స్పృహలోకి వచ్చిన వెంటనే ఆస్పత్రికి తరలించగా వారు మిగతా వైద్యం చేసి ప్రాణాలను కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న సైబరాబాద్ సీపీ అన్వేస్ మహంతి శివకుమార్‌కు అవార్డు, రివార్డును సైతం ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News