Share News

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 11గంటల నుంచి కరెంట్ కట్

ABN , Publish Date - Sep 12 , 2026 | 08:03 AM

హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో వినాయక నిమజ్జన పనుల నిమిత్తం శనివారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు.

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 11గంటల నుంచి కరెంట్ కట్
Hyderabad power cut today

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఆజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో వినాయక నిమజ్జన పనుల నిమిత్తం శనివారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీ ఏడీఈ నాగేశ్వరరావు తెలిపారు. గౌరమ్మ లేన్‌, సాయిబాబా కమాన్‌, సుందరయ్యపార్క్‌ పరిసరాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రామాలయం, న్యూనల్లకుంట, నరేంద్రపార్క్‌, సిండికేట్‌ బ్యాంక్‌ పరిసరాల్లో మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల వరకు విద్యుత్‌ సరఫరాను నిలి పివేస్తామని, ఈ విషయాన్ని వినియోగదారులు గమనించి తమ సిబ్బందికి సహకరించాలని ఏడీఈ కోరారు.


city2.2.jpgహయత్‌నగర్‌: తుర్కయంజాల్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎంవీఎ్‌సఆర్‌ ఫీడర్‌ పరిధిలో శనివారం ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫీడర్‌ మరమ్మతుల కారణంగా విద్యుత్‌ అంతరాయం కలుగుతుందని సబ్‌స్టేషన్‌ ఏఈ రవీందర్‌రెడ్డి తెలిపారు. కమ్మగూడ, ఎంఎల్‌ఆర్‌ కాలనీ, కొటగడ్డ, వెంకటేశ్వరకాలనీ, ప్లాటీనం సిటీ, రాజ్యలక్ష్మినగర్‌, కింగ్‌వే, వెంకటాద్రినివాస్‌, ఏఎంఆర్‌ కాలనీ, కృష్ణ హోంస్‌, సెవన్‌ హిల్స్‌, సిద్దార్థకాలనీ, మాతృశ్రీనగర్‌, శాంతినగర్‌, వైకుంఠపురం, శ్రీరాం ఎన్‌క్లేవ్‌, ఏవీరెడ్డి, ప్రేస్‌ కాలనీ, ఎంప్లాయీస్‌ కాలనీ, సలీం వెంచర్‌, సాయిరాంనగర్‌ కాలనీ, వినాయకనగర్‌ కాలనీలో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పెరిగిన బంగారం ధర

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 08:03 AM