Share News

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టం: భట్టి

ABN , Publish Date - Sep 12 , 2026 | 06:48 AM

రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన చేయబోమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామంటూ ...

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టం: భట్టి
Bhatti Vikramarka

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచన చేయబోమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామంటూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కేంద్రప్రభుత్వం దగ్గర సంతకం చేసిందని ఆయన ఆరోపించారు. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో భట్టి మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఉదయ్‌ పథకం కింద త్రైపాక్షిక ఒప్పందం చేసుకుందని చెప్పారు. మరోవైపు, రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామని భట్టి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, దేశంలోనే తొలిసారి రూ.కోటి వరకు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించినట్లు భట్టి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

విమలక్క కళా ప్రస్థానంపై 50 గంటల ప్రజా కళా జాతర
నేడు, రేపు భారీ వర్షాలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 06:48 AM