నేడు, రేపు భారీ వర్షాలు
ABN , Publish Date - Sep 12 , 2026 | 06:32 AM
ఒడిసా దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణలో శని, ఆదివారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ప్రకటించింది.
హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఒడిసా దక్షిణ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణలో శని, ఆదివారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ తదితర 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో ఓ మోస్తరుగా వానలు పడతాయని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
పారిశ్రామికవేత్తలకు బీఆర్‌ఎస్ బెదిరింపులు
చెప్పినట్టు వినకుంటే.. కొలువు పీకేయిస్తా!
Read Latest AP News And Telangana News And International News And Telugu News