Share News

అనలాగ్‌ పనీర్‌పై నిషేధం

ABN , Publish Date - Sep 12 , 2026 | 06:11 AM

ప్రజారోగ్యానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అనలాగ్‌ పనీర్‌ (నాన్‌-డెయిరీ/కృత్రిమ పనీర్‌)పై ప్రభుత్వం నిషేధం విధించింది.

అనలాగ్‌ పనీర్‌పై నిషేధం
Analog Paneer

  • రాష్ట్రంలో తయారీ, విక్రయం, నిల్వ, రవాణాపై ఏడాది పాటు ఆంక్షలు

  • తక్షణమే అమలులోకి..

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్యానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అనలాగ్‌ పనీర్‌ (నాన్‌-డెయిరీ/కృత్రిమ పనీర్‌)పై ప్రభుత్వం నిషేధం విధించింది. అనలాగ్‌ పనీర్‌ తయారీ, ప్రొసెసింగ్‌, ప్యాకింగ్‌, నిల్వ, పంపిణీ, రవాణా, విక్రయాలపై నిషేధం విధిస్తూ తెలంగాణ ఫుడ్‌సేఫ్టీ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిషేధం 2026 సెప్టెంబరు 10 నుంచి తక్షణమే అమల్లోకి వస్తుందని, ఏడాది పాటు అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

విద్య ప్రైవేటీకరణను ఆపండి

ట్రాక్టర్లపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 06:11 AM