Share News

ట్రాక్టర్లపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు

ABN , Publish Date - Sep 12 , 2026 | 06:01 AM

రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్రం తెచ్చిన ‘ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన’ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్న నిరసన తెలిపారు.

ట్రాక్టర్లపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు
BJP MLAs

ఫసల్‌ బీమా అమలు చేయాలంటూ వినూత్న నిరసన

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్రం తెచ్చిన ‘ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన’ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్న నిరసన తెలిపారు. ఎమ్మెల్యేలు పాల్వయి హరీశ్‌ బాబు, రామారావు పవార్‌ పాటిల్‌, పైడి రాకేష్‌ రెడ్డిలతో కలిసి.. బీజేఎల్పీ ఉపనేత పాయల్‌శంకర్‌ స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి గన్‌ పార్క్‌ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్నారు.


అక్కడి నుంచి రైతాంగ డిమాండ్ల ప్లకార్డులతో అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు గేటు వద్దే వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పాయల్‌ శంకర్‌ మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల కారణంగా పంటలు నష్టపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన’ను రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల వేలాది మంది రైతులు నష్టపరిహారానికి దూరమవుతున్నారని మండిపడ్డారు. పంట నష్టపరిహారం, మద్దతు ధర, పూర్తిస్థాయి రుణమాఫీ అందించే వరకు అసెంబ్లీ లోపలా, వెలుపలా నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

విద్య ప్రైవేటీకరణను ఆపండి

విద్యకు అత్యంత ప్రాధాన్యం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 06:01 AM