విద్య ప్రైవేటీకరణను ఆపండి
ABN , Publish Date - Sep 12 , 2026 | 05:54 AM
విద్యా రంగ ప్రైవేటీకరణను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న డిమాండ్ చేశారు. శాసన మండలిలో విద్యా ప్రైవేటీకరణపై శుక్రవారం జరిగిన చర్చలో పాట రూపంలో ఆయన తన గళం వినిపిస్తూ..
స్కిల్ వర్సిటీలో పాలిటెక్నిక్‌లను కలపొద్దు
కేసీఆర్ హయాంలోనూ తప్పులు
మల్లారెడ్డి వర్సిటీకి అనుమతి సరి కాదు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న
ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద పైసా ఖర్చు చేయని సర్కారు: శ్రీపాల్‌రెడ్డి
ప్రైవేటు వర్సిటీల ఇష్టారాజ్యం: కొమరయ్య
హైదరాబాద్, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): విద్యా రంగ ప్రైవేటీకరణను ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న డిమాండ్ చేశారు. శాసన మండలిలో విద్యా ప్రైవేటీకరణపై శుక్రవారం జరిగిన చర్చలో పాట రూపంలో ఆయన తన గళం వినిపిస్తూ.. స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీలను కలపాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పారు. ఇది విద్యా ప్రైవేటీకరణకు ఆరంభమని, ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాలిటెక్నిక్‌ల గొంతు కోయవద్దన్నారు. విద్యా రంగ ప్రైవేటీకరణను నెహ్రూ, ఇందిరాగాంధీ పూర్తిగా వ్యతిరేకిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు తలొగ్గి విద్యను ప్రైవేటు పరం చేస్తోందని ఆరోపించారు.
తమ అధినేత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనూ అనేక తప్పులు జరిగాయన్నారు. గత ప్రభుత్వం మల్లారెడ్డి కాలేజీకి యూనివర్సిటీ హోదా ఇవ్వడం సరి కాదని గోరేటి వెంకన్న పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్య పథకం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి రూ.180 కోట్లు సేకరించిన సర్కారు.. ఇప్పటి వరకూ వారిపై ఒక్క పైసా ఖర్చు చేయలేదన్నారు. అత్యవసర వైద్యానికి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉపాధ్యాయులు రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రైవేటు వర్సిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, ఏఐసీటీఈ నిబంధనలకు విరుద్ధంగా అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువగా ప్రవేశాలు చేపడుతున్నాయన్నారు. వీటిపై విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పట్టణ స్థానిక సంస్థల్లో కో-ఆప్షన్ మెంబర్లుగా ట్రాన్స్‌జెండర్లు
విద్యకు అత్యంత ప్రాధాన్యం
Read Latest AP News And Telangana News And International News And Telugu News