పట్టణ స్థానిక సంస్థల్లో కో-ఆప్షన్ మెంబర్లుగా ట్రాన్స్‌జెండర్లు
ABN , Publish Date - Sep 12 , 2026 | 05:37 AM
మున్సిపల్ కార్పొరేషన్లు/మున్సిపాల్టీల్లో కో-ఆప్షన్ మెంబర్లుగా ట్రాన్స్‌జెండర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పురపాలక చట్టం-2019 సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.
మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చాన్స్
తెలంగాణ పురపాలక చట్టం సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మున్సిపల్ కార్పొరేషన్లు/మున్సిపాల్టీల్లో కో-ఆప్షన్ మెంబర్లుగా ట్రాన్స్‌జెండర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పురపాలక చట్టం-2019 సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. మండలి కూడా ఆమోదించిన తర్వాత, గవర్నర్ సంతకం అయ్యాక చట్టరూపం దాల్చితే ట్రాన్స్‌జెండర్లను కో-ఆప్షన్ మెంబర్లుగా ప్రభుత్వం నియమించనుంది. ఒక్కో మున్సిపాల్టీలో ఇద్దరేసి సభ్యులు కో-ఆప్షన్ మెంబర్లుగా ఉంటారు. వారిలో ఒకరిని మైనార్టీ వర్గం నుంచి మరొకరిని ట్రాన్స్‌జెండర్ నుంచి నియమించే అవకాశం ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త పాలకవర్గం ఏర్పడ్డాక ఐదుగురు కో-ఆప్షన్‌మెంబర్లను నామినేట్ చేయనున్నారు. మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కాగానే కో-ఆప్షన్ మెంబర్లుగా ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు అవకాశం కల్పించనుంది. ట్రాన్స్‌జెండర్ సంబంధిత మున్సిపాల్టీ/మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓటర్‌గా నమోదై ఉండాలి. వయసు విధిగా 21 ఏళ్లు నిండి ఉండాలి. రాష్ట్రంలో 131 మున్సిపాల్టీలు ఉండగా 14 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. మొత్తం 145 మంది ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ మెంబర్లుగా అవకాశం రానుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రజల గుండెలపై కుంపటిలా సెక్షన్లు!
సురేఖ మాజీ ఓఎస్‌డీ తండ్రి ఆత్మహత్యాయత్నం
Read Latest AP News And Telangana News And International News And Telugu News