ప్రజల గుండెలపై కుంపటిలా సెక్షన్లు!
ABN , Publish Date - Sep 12 , 2026 | 05:19 AM
సెక్షన్ 22ఏ.. రాష్ట్రంలో ఇప్పుడు ఎవరి నోట విన్నా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఏవైనా భూముల వివరాలను ఈ సెక్షన్‌లోని జాబితాలో చేర్చితే.. ఇక భూముల రిజిస్ర్టేషన్ జరగదని, భూమి, జాగ, ఇల్లు, పొలం, ఫ్లాట్ ఏదైనా ఇక మనవి కానట్లేనన్న ఆందోళన నెలకొంది.
ప్రభుత్వ భూముల రక్షణకు తెచ్చిన 22ఏ..
పాత వివరాలు, అవగాహన లేకుండా అప్‌లోడ్ చేయడంతో సమస్య
ప్రక్షాళన, సక్రమ రికార్డుల కోసం.. డెడ్‌లైన్ పెట్టి అప్‌లోడ్ చేయాలన్న హైకోర్టు
కోర్టు తీర్పునకు రివర్స్‌లో వ్యవహారం ప్రభుత్వమే కేటాయించిన భూములు, చేసిన లే అవుట్‌లూ నిషేధిత జాబితాలోకి
ప్రజల ప్రైవేటు ఆస్తులనూ చేర్చడంతో చిక్కు
ప్రజల్లో ఆందోళన.. దిద్దుబాటలో సర్కారు
హైదరాబాద్‌లో 95 వేల డోర్ నంబర్లు 22ఏలోకి
ప్రస్తుతం 90 శాతానికి పైగా తొలగింపు
నేడు అసెంబ్లీలో 22ఏపై కీలక చర్చ
హైదరాబాద్, సెప్టెంబరు 11, (ఆంధ్రజ్యోతి): సెక్షన్ 22ఏ.. రాష్ట్రంలో ఇప్పుడు ఎవరి నోట విన్నా దీనిపైనే చర్చ జరుగుతోంది. ఏవైనా భూముల వివరాలను ఈ సెక్షన్‌లోని జాబితాలో చేర్చితే.. ఇక భూముల రిజిస్ర్టేషన్ జరగదని, భూమి, జాగ, ఇల్లు, పొలం, ఫ్లాట్ ఏదైనా ఇక మనవి కానట్లేనన్న ఆందోళన నెలకొంది. దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదాలు, పరస్పర విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి తెచ్చిన సెక్షన్ ఇది. అలాంటిది.. ప్రజలను ఇబ్బంది పెట్టడమేంటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తీవ్ర వివాదాలకు దారితీసిన ఈ 22ఏ సెక్షన్‌పై శనివారం అసెంబ్లీలో చర్చ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ సెక్షన్ ఏంటి? ఎందుకొచ్చింది? ఎప్పుడొచ్చింది? మరి ఇప్పుడే వచ్చిన సమస్య ఏంటి? ఎందుకొచ్చింది? అన్న అంశాలను పరిశీలిస్తే..
1999లో తెచ్చిన సెక్షన్..
2005 ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ర్టార్‌గా పనిచేసిన ఒక అధికారి, ‘చార్మినార్‌ను అయినా రిజిస్ర్టేషన్ చేసేస్తాం’ అంటూ చేసిన వ్యాఖ్య పెద్ద చర్చకే దారి తీసింది. చార్మినార్ ప్రభుత్వానిది కదా? దానినెలా రిజిస్ర్టేషన్ చేస్తారు? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తింది. కానీ, అప్పటికి ఆ జిల్లా రిజిస్ర్టార్ చెప్పినదానిలో లాజిక్ ఉంది. ఎందుకంటే ఏ భూమి, స్థలం, భవనం, కట్టడం.. ఏదైనా సరే రిజిస్ర్టేషన్ కోసం సబ్ రిజిస్ర్టార్ దగ్గరకు వస్తే దానిని తిరస్కరించేందుకు వీల్లేదు. రిజిస్ట్రేషన్ చేసి తీరాల్సిందే. స్టాంపులు, రిజిస్ర్టేషన్ల చ ట్టాన్ని 1908లో కేంద్ర ప్రభుత్వం తీసుకురాగా.. అందులో రిజిస్ర్టేషన్ల వ్యవస్థ, రిజిస్ర్టేషన్లు చేయాల్సిన పద్ధతి, ఫీజులు, అధికారుల అధికారాలు, విధులు తదితర అంశాలున్నాయి.
కానీ, ప్రభుత్వ భూములు, రిజిస్ర్టేషన్ చేయకూడని ఇతర భూముల వివరాలను ప్రత్యేకంగా ఒక జాబితాలో పెట్టి.. ‘వీటిని రిజిస్ర్టేషన్ చేయకూడదు’ అన్న నిబంధనేదీ లేదు. ఆ అవసరం పాతరోజుల్లో పెద్దగా రాలేదు కూడా. కానీ, ఆ తర్వాత ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు, అటవీ, దేవాదాయ భూముల్లాంటివి కూడా రిజిస్ర్టేషన్ అయిపోతుండడంతో.. వాటన్నింటినీ కొన్ని సెక్షన్లలో పెట్టాలని నిర్ణయించారు. 1999లో ఆ మేరకు 22ఏ అనే సెక్షన్‌ను, దానికి అనుబంధంగా బీ, సీ, డీ, ఈ అనే సబ్ సెక్షన్లను తెచ్చారు.
ఒక్కో సబ్ సెక్షన్‌లో ఒక్కో రకం భూములను పెట్టి, వాటికి సంబంధించిన సర్వే నంబర్లను కూడా పెట్టి.. ఆ భూములను రిజిస్ర్టేషన్ చేయడంపై నిషేధం విధించారు. అదే ‘నిషేధిత జాబితా’. అయితే ఆ తర్వాత హైకోర్టు ఆ జీవో చెల్లదంటూ కొట్టేసింది. ఎందుకంటే స్టాంపులు, రిజిస్ర్టేషన్ల చట్టం-1908 అనేది కేంద్రం తెచ్చిన చట్టం. దానికి అవసరమైన మార్పులను రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చుకోవచ్చు. కానీ, అది ఆ చట్టానికి సవరణ చేయడం, ఆపై కేంద్రం ఆమోదం తీసుకోవడం ద్వారానే చేయాల్సి ఉంటుంది. దీంతో 2006లో స్టాంపులు, రిజిస్ర్టేషన్ల చట్టానికి మళ్లీ సవరణ చేసి.. దానికి కేంద్రం ఆమోదం పొంది 2007 నుంచి ఈ సెక్షన్లను అమల్లోకి తెచ్చారు.
తేడా ఎక్కడ? ఎందుకు జరిగింది?
హైకోర్టులో 22ఏ జాబితాపై అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. కోర్టు అనేక కేసుల్లో తీర్పులు కూడా ఇచ్చింది. అయినా ఈ కేసుల సంఖ్యకు అంతే లేకుండా పోతుండడం, రికార్డుల్లో తేడాలు ఉంటుండడంతో.. మొత్తం జాబితాను పరిశీలించి, తప్పుల్లేకుండా అప్‌లోడ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు 2025 డిసెంబరులో ఈ జాబితాను రీ ఎంట్రీ చేసి అప్‌డేట్ చేశారు. అయితే ఇక్కడే అనేక పొరపాట్లు జరిగాయి. 22ఏ జాబితాలో పెట్టాల్సిన భూముల వివరాలే కాకుండా ప్రజలకు సంబంధించిన భూములు, స్థలాలను కూడా అందులోకి చేర్చేశారు. అంతేకాదు.. ఒకప్పుడు ప్రభుత్వ భూములుగా ఉన్న వాటిని ఆ తర్వాత 50 ఏళ్ల కాలంలో ప్రభుత్వమే పలు కంపెనీలు, సంస్థలకు అమ్మింది.. కేటాయించింది.
అంటే.. భూములు ఆయా కంపెనీలు, సంస్థలవే. అవుతాయి. కానీ, ఆ కేటాయింపు జరిగిన విషయాన్ని పట్టించుకోకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా.. ఆ భూములను కూడా మళ్లీ నిషేధిత జాబితాలో పెట్టేశారు. సింపుల్‌గా చెప్పాలంటే పాత రికార్డులను కొత్త రికార్డులతో సరిపోల్చకుండా నిర్లక్ష్యంగా పని కానిచ్చేశారు. ఉదాహరణకు సర్వే నంబర్ 10లో 10 ఎకరాల భూమి ఉందనుకుంటే.. అందులో 9ఎకరాలు ప్రైవేటుది, ఒక ఎకరం ప్రభుత్వానిది ఉంటే.. ఆ ఒక్క ఎకరాన్ని మాత్రమే నిషేధిత జాబితాలో పెట్టాలి. కానీ, ఆ మొత్తం సర్వే నంబర్‌ను, అందులో ఉన్న 10 ఎకరాలనూ నిషేధిత జాబితాలోకి నెట్టేశారు. ఎలాంటి విచారణ చేయకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇక్కడే మరో ట్విస్టు కూడా చోటుచేసుకుంది. గతంలో 22ఏ జాబితాల అప్‌లోడ్ బాధ్యతను సబ్ రిజిస్ర్టార్లకు అప్పగించేవారు. అంటే.. జిల్లా కలెక్టర్లు సబ్ రిజిస్ర్టార్లకు నిషేధిత జాబితా వివరాలు ఇచ్చేవారు. సబ్ రిజిస్ర్టార్లు అప్‌డేట్ చేసేవారు. అయితే ఈసారి సబ్ రిజిస్ర్టార్లు కాకుండా.. నేరుగా కలెక్టరేట్లలోనే ఈ నిషేధిత జాబితాను అప్‌లోడ్ చేశారు. కలెక్టర్లు, ఆర్డీవోలకు, అక్కడినుంచి తహశీల్దార్లకు, అక్కడినుంచి ఇంకా కిందిస్థాయి సిబ్బందికి అలా పని అప్పగించేశారు. దాంతో ఎలాంటి వెరిఫికేషన్ లేకపోవడంతో పాటు.. కోర్టు కేసుల్లో ఉన్న భూముల వివరాలను నిషేధిత జాబితాలో చేర్చేయడంతో అంతా గందరగోళంగా మారింది.
ఇక్కడే మరో ట్విస్టు కూడా చోటుచేసుకుంది. గతంలో 22ఏ జాబితాల అప్‌లోడ్ బాధ్యతను సబ్ రిజిస్ర్టార్లకు అప్పగించేవారు. అంటే.. జిల్లా కలెక్టర్లు సబ్ రిజిస్ర్టార్లకు నిషేధిత జాబితా వివరాలు ఇచ్చేవారు. సబ్ రిజిస్ర్టార్లు అప్‌డేట్ చేసేవారు. అయితే ఈసారి సబ్ రిజిస్ర్టార్లు కాకుండా.. నేరుగా కలెక్టరేట్లలోనే ఈ నిషేధిత జాబితాను అప్‌లోడ్ చేశారు. కలెక్టర్లు, ఆర్డీవోలకు, అక్కడినుంచి తహశీల్దార్లకు, అక్కడినుంచి ఇంకా కిందిస్థాయి సిబ్బందికి అలా పని అప్పగించేశారు. దాంతో ఎలాంటి వెరిఫికేషన్ లేకపోవడంతో పాటు.. కోర్టు కేసుల్లో ఉన్న భూముల వివరాలను నిషేధిత జాబితాలో చేర్చేయడంతో అంతా గందరగోళంగా మారింది.
తొలుత 22ఏలో ఉన్నా రిజిస్ర్టేషన్లు.. తర్వాత ఆపేయడంతో
గత డిసెంబరులో నిషేధిత జాబితాను అప్‌లోడ్ చేసినా.. సమస్య తలె త్తింది మాత్రం ఈ ఏడాది మార్చి నుంచే. పైగా, ప్రజల ఆస్తులు ఎక్కువగా నిషేధిత జాబితాలోకి వెళ్లింది హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే. మిగతా జిల్లాల్లోనూ ఉన్నా ఈ స్థాయిలో లేవు. హైదరాబాద్ జిల్లాలో మరీ ఎక్కువగా సమస్య తలెత్తింది. ఈ ఒక్క జిల్లాలోనే 95 వేల డోర్ నంబర్లు నిషేధిత జాబితాలోకి చేరిపోయాయి. అందులో సీఎం రేవంత్‌రెడ్డి నివాసం ఉంటున్న ఇంటితోపాటు జూబ్లీహిల్స్‌లోని చాలా ప్రాంతం, గోపన్‌పల్లిలో ప్రభుత్వమే కంపెనీలకు కేటాయించిన భూములు, సొసైటీలకు ఇచ్చిన ఇంటి స్థలాలను కూడా చేర్చేశారు.
తొలుత 22ఏలో ఉన్నా రిజిస్ర్టేషన్లు.. తర్వాత ఆపేయడంతో
గత డిసెంబరులో నిషేధిత జాబితాను అప్‌లోడ్ చేసినా.. సమస్య తలె త్తింది మాత్రం ఈ ఏడాది మార్చి నుంచే. పైగా, ప్రజల ఆస్తులు ఎక్కువగా నిషేధిత జాబితాలోకి వెళ్లింది హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే. మిగతా జిల్లాల్లోనూ ఉన్నా ఈ స్థాయిలో లేవు. హైదరాబాద్ జిల్లాలో మరీ ఎక్కువగా సమస్య తలెత్తింది. ఈ ఒక్క జిల్లాలోనే 95 వేల డోర్ నంబర్లు నిషేధిత జాబితాలోకి చేరిపోయాయి. అందులో సీఎం రేవంత్‌రెడ్డి నివాసం ఉంటున్న ఇంటితోపాటు జూబ్లీహిల్స్‌లోని చాలా ప్రాంతం, గోపన్‌పల్లిలో ప్రభుత్వమే కంపెనీలకు కేటాయించిన భూములు, సొసైటీలకు ఇచ్చిన ఇంటి స్థలాలను కూడా చేర్చేశారు. డిసెంబరులో 22ఏ జాబితాను అప్‌లోడ్ చేసినా.. తొలి రెండు నెలలు సమస్య తలెత్తలేదు.
ఎందుకంటే అది 22ఏలో ఉన్నా ప్రైవేటు భూమి అని సబ్ రిజిస్ర్టార్‌కు తెలియడంతో రిజిస్ర్టేషన్లు చేసేశారు. ఉదాహరణకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో 102, 103, 129/పి, 403 సర్వే నంబర్లలో కలిపి సుమారు 3వేల ఎకరాలు ఉంటుంది. ఇందులో 3వేల గజాలు మాత్రమే వివాదాస్పద భూమి. మిగతాదంతా ప్రైవేటు వారిదే. ఆ 3వేల గజాలు కూడా ఇద్దరు ప్రైవేటు పార్టీల మధ్య కేసుల వల్లే వివాదంలో ఉంది. ఇలా న్యాయస్థానాల్లో కేసులున్న భూములను, రిజిస్ర్టేషన్‌లపై స్టే ఉత్తర్వులున్న వాటిని గతంలో రిజిస్ర్టేషన్ చేసేవారు కాదు. మళ్లీ కోర్టు స్టే ఎత్తివేస్తే.. ఆ తీర్పు ప్రతివారికీ అందితే వాటిని రిజిస్ర్టేషన్ చేసేవారు.
అయితే గత డిసెంబరులో 22ఏ జాబితాను కలెక్టర్లు అప్‌లోడ్ చేసేటప్పుడు కోర్టు కేసుల్లో ఉన్న భూములను సంపూర్ణంగా నిషేధిత జాబితాలోకి చేర్చేశారు. అంటే 3వేల గజాల భూమిపై కోర్టు కేసులున్నందుకు.. ఆ సర్వే నంబర్లకు సంబంధించిన 1200 ఎకరాలకు పైగా భూమిలో చేసిన నిర్మాణాలన్నింటినీ నిషేధిత జాబితాలో పెట్టేశారు. ఇలా పెట్టినా.. మొదటి రెండు నెలలు సబ్ రిజిస్ర్టార్లకు విషయం తెలుసు కాబట్టి.. వివాదాల్లేని భూమిలో ఉన్న ఇళ్లు, అపార్ట్‌మెంట్ల రిజిస్ర్టేషన్లు చేసేశారు. అయితే ఆ తర్వాత 22ఏలో పెట్టిన వాటిని ఎలా రిజిస్ర్టేషన్లు చేస్తారన్న ప్రశ్న ఉన్నతాధికారుల నుంచే వచ్చింది. దాంతో సబ్ రిజిస్ర్టార్లు రిజిస్ర్టేషన్లు ఆపేశారు. హైదరాబాద్ జిల్లాలోనే సుమారు 95 వేల డోర్ నంబర్లతో కూడిన అపార్ట్‌మెంట్లు, ఇళ్లు ఇలా నిషేధిత జాబితాలోకి వెళ్లిపోవడంతో.. రిజిస్ర్టేషన్లు ఆగిపోయాయి. దీంతో ప్రజలు ఆందోళన బాట పట్టారు.
తప్పుల సవరణ దిశగా..
ప్రస్తుతం ప్రభుత్వం ఈ తప్పుల తడకల నిషేధిత జాబితాను సరిదిద్ది, సక్రమమైన జాబితాను అప్‌లోడ్ చేసే పనిలో ఉంది. ఇందులో కొంతమేర ఇప్పటికే సరిచేయగలిగింది. ఉదాహరణకు హైదరాబాద్‌లో తొలుత ఉన్న 95 వేల డోర్ నంబర్లతో కూడిన ఇళ్లు, ఫ్లాట్లను నిషేధిత జాబితాలో పెట్టేయగా.. ఇప్పుడు వాటిలో అత్యధిక శాతం సరిచేసి తొలగించినట్లు సమాచారం. మిగతా జిల్లాల్లో కూడా ఈ ప్రక్రియ సాగుతున్నా.. ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.
22ఏ సెక్షన్‌లో ఎక్కడ ఏ భూములంటే...
చట్ట సవరణ, కేంద్రం అనుమతి ద్వారా అమల్లోకి వచ్చిన 22ఏ సెక్షన్ అంటే.. రిజిస్ర్టేషన్‌లు చేయడానికి వీల్లేని నిషేధిత జాబితా. 22ఏ(1) ద్వారా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రభుత్వం నోటిఫై చేసిన భూముల రిజిస్ర్టేషన్లను ఆపే అధికారం దఖలు పడింది. ఇందులో , బీ, సీ, డీ, ఈ అనే ఉప సెక్షన్‌లు ఉన్నాయి. ఒక్కో ఉప సెక్షన్‌లో ఒక్కో రకం భూముల వివరాలను పొందుపరిచి వాటి రిజిస్ర్టేషన్లను నిషేధించారు.
22ఏ(1)(ఏ)లో.. అసైన్డ్ భూములు, భూదాన భూములు
22ఏ(1)(బీ)లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భూములు
22ఏ(1)(సీ)లో దేవాదాయ, వక్ఫ్ భూములు
22ఏ(1)(డీ)లో సీలింగ్ భూములు
22ఏ(1)(ఈ)లో ప్రభుత్వం నోటిఫై చేసిన భూములు, స్థానిక సంస్థల భూములు, కోర్టు అటాచ్‌మెంట్‌లో ఉన్న భూములు.
ఈ వార్తలు కూడా చదవండి:
క్యూర్.. పాలనపై కేర్!
కోర్సు పూర్తి చేస్తేనే డ్రైవింగ్ లైసెన్స్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News