Share News

క్యూర్‌.. పాలనపై కేర్‌!

ABN , Publish Date - Sep 12 , 2026 | 04:46 AM

(ఆంధ్రజ్యోతి): తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలో సమర్థవంతమైన పాలన, డిజిటల్‌ ఆధారిత వ్యవస్థగా తీర్చిదిద్దడం దిశగా కీలక అడుగు పడింది. క్యూర్‌ ముసాయిదా బిల్లు-2026ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

క్యూర్‌.. పాలనపై కేర్‌!
HYDRAA

  • సులభతర సేవలు... ఆర్ధికాభివృద్ధి.. హైడ్రాకు అదనపు అధికారాలు

  • ఆక్రమణదారులపై క్రిమినల్‌ కేసులు..

  • అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలో సమర్థవంతమైన పాలన, డిజిటల్‌ ఆధారిత వ్యవస్థగా తీర్చిదిద్దడం దిశగా కీలక అడుగు పడింది. క్యూర్‌ ముసాయిదా బిల్లు-2026ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. క్యూర్‌ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో ఏకీకృత పాలనా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం.. కాలం చెల్లిన, అవసరం లేని నిబంధనలను తొలగించడం.. ప్రస్తుత అవసరాలకు తగినట్టుగా మార్పులు చేయడం లక్ష్యంగా క్యూర్‌ బిల్లును రూపొందించినట్టు తెలిపింది. క్యూర్‌ పరిధిలోని కార్పొరేషన్లు, పట్టణ అధికార సంస్థలు, శాఖల మధ్య సమన్వయం, భవిష్యత్‌, వ్యూహాత్మక ప్రాధాన్యతలు నిర్దేశించేలా.. సీఎం నేతృత్వంలో పనిచేసే క్యూర్‌ అపెక్స్‌ గవర్నెన్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు కానుంది.


ఈ కౌన్సిల్‌ నిర్ణయాల అమలు, పర్యవేక్షణ కోసం క్యూర్‌ కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేస్తారు. దీనికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షుడిగా, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. క్యూర్‌ పరిధిలో పర్యావరణ పరిరక్షణ, అగ్నిమాపక, ఆహార భద్రత, విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయాలు, సమీకృత చెల్లింపునకు డిజిటల్‌ పాలనతో సహ కార్యాచరణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తామని ముసాయిదాలో ప్రభుత్వం పేర్కొం. సులువుగా వ్యాపార అనుమతుల జారీ, రాత్రివేళల్లో వ్యాపారాలకు అనుమతికిఊతం ఇవ్వనున్నట్టు తెలిపింది. ప్రజాఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక అధికార సంస్థ (క్యూర్‌ అప్పిలేట్‌ అథారిటీ) ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.


ఆక్రమణదారులపై క్రిమినల్‌ కేసులు

క్యూర్‌ బిల్లులో హైడ్రాకు అదనపు అధికారాలు ప్రతిపాదించారు. ఆక్రమణల తొలగింపుతోపాటు బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసే అధికారం కల్పించనున్నారు. భవనాల్లో అగ్నిమాపక ఏర్పాట్ల తనిఖీలు ముమ్మరంగా చేపట్టి, ప్రమాదకరంగా ఉన్నట్టు భావిస్తే.. ఆ ప్రాంగణాన్ని సీజ్‌ చేస్తారు. ఇక పర్యావరణ పరిరక్షణకూ బిల్లులో ప్రాధాన్యమిచ్చారు. కాలుష్యానికి కారణమయ్యే సంస్థలు/వ్యక్తులకు.. తొలిసారి ఉల్లంఘనకు రూ.50 వేలు, అనంతరం ప్రతి ఉల్లంఘనకు రూ.3 లక్షల చొప్పున జరిమానా విధిస్తారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ వస్తువులపై నిషేధం విధిస్తారు. క్యూర్‌ పరిధిలో అత్యవసర సేవల కోసం పౌర పోర్టల్‌ అందుబాటులోకి తెస్తారు.


ఏదైనా విపత్తు తలెత్తితే అన్నిశాఖలను అప్రమత్తం చేసేలా క్యూర్‌ స్మార్ట్‌ గవర్నెన్స్‌ సెంటర్‌ను.. ట్రాఫిక్‌ నిర్వహణ కోసం రహదారి భద్రతా సంస్థను ఏర్పాటు చేస్తారు. చిన్నపాటి ఉల్లంఘనలకు క్రిమినల్‌ చర్యలకు బదులు దశల వారీగా సివిల్‌ జరిమానాలు ఉంటాయి. అసంఘటిత కార్మికులు, గిగ్‌ వర్కర్ల సంక్షేమం, ప్రయోజనాల పరిరక్షణకు క్యూర్‌ పట్టణ జీవనోపాధి సమన్వయ విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. క్యూర్‌లో ప్రకటనల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేస్తారు. అనుమతి లేకుండా హోర్డింగులు, ఫ్లెక్సీలు, ప్రకటనలు ఏర్పాటుచేస్తే తొలగిస్తారు. బాధ్యులకు 6 నెలల జైలుశిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి:

దొంగ దొరికాడు
ఓ వీరప్పన్‌.. ఓ రేవంత్‌!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 04:46 AM