బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకే గూటి పక్షులు
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:48 AM
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రం లోని బీఆర్‌ఎస్ పార్టీ ఒకే గూటి పక్షులని పీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర ఆరో పించారు.
సిరిసిల్ల టౌన్, సెప్టెంబరు 11 (ఆంధ్ర జ్యోతి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రం లోని బీఆర్‌ఎస్ పార్టీ ఒకే గూటి పక్షులని పీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర ఆరో పించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాం గ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని నరేం ద్రమోదీ ప్రభుత్వం ఏ విధంగా దళితులపై దాడి చేస్తుందో రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ దళి తులపై దాడులు చేస్తోందని ప్రజలు గ్రహిం చాలన్నారు. ఉత్తరాఖాండ్‌లో పీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను బీజేపీ అనుబంధ సంస్థలు శుద్ధి కార్యక్రమంతో అవమానించాయని ధ్వజ మెత్తారు. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మే రకే రాష్ట్రంలో బీఆర్‌ఎస్ నాయకులు దళితుల పై దాడులు చేస్తున్నారని ఆక్షేపించారు. శాసన సభ సమావేశాలు ఏర్పాటు చేస్తున్న సందర్భం గా కేసీఆర్ ఫాంహౌస్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎల్‌పీ సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంపైన దాడి చేయాలని కేసీఆర్ ఉసి గొలిపాడని ఆరోపించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పా లనలో అవినీతిఅక్రమాలు జరిగాయో ప్రజలం దరికి తెలుసని, ఇప్పుడు శాసన సభ సమావే శాలు జరిగితే తమ అక్రమాలు బయటకు వస్తాయిని అసెంబ్లీ వద్ద నానాహైరానా సృష్టిం చారన్నారు. శాసన సభ సమావేశంలో 22ఏ, విద్యా వ్యవస్థపైన, ప్రజా సంక్షేమ పథాకాలపై చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంద ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారన్నా రు. 22ఏ చర్చలో గత ప్రభుత్వంలో మంత్రి హరీష్‌రావు అవినీ తి అక్రమాలు బ యటకు వస్తాయ ని అసెంబ్లీ గేటు వద్ద పోలీసులపై ప్రతాపం చూపిం చారన్నారు. ఇప్పటి కైనా మాజీ మం త్రులు కేసీఆర్, హ రీష్‌రావులు స్పీకర్ కు క్షమాపణ చె ప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షు డు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల పట్టణ అధ్య క్షుడు సూర దేవరాజు, ప్రధాన కార్యదర్శులు నీలి రవీందర్, నేదురి లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల జగన్, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధా నకార్యదర్శి ఆకునూరి బాలరాజు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ఆడెపు చంద్రకళప్ర భాకర్, కౌన్సిల ర్లు కూర శ్రీశైలం, బొద్దుల శ్రీనివాస్, లింగంప ల్లి గంగరాజు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.