మిల్లింగ్ సమస్యలకు పరిష్కారం చూపాలి
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:23 AM
ధాన్యం మిల్లింగ్ సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అన్నమనేని సుధాకర్‌రావు ప్రభుత్వాన్ని కోరారు.
సుభాష్‌నగర్, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): ధాన్యం మిల్లింగ్ సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అన్నమనేని సుధాకర్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. కలెక్టరేట్ ఎదుట రైస్ మిల్లర్స్ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైస్ మిల్లర్లు యాసంగిలో వచ్చిన ధాన్యం బాయిల్డ్ రైస్‌కు అనుకూలంగా ఉందన్నారు. అధిక వర్షాలకు ధాన్యం దెబ్బతిన్న నేపథ్యంలో మిల్లింగ్, సీఎంఆర్ డెలివరీకి అదనపు సమయం అవసరం ఉందని, డిసెంబరు వరకు ఎక్స్‌టెన్షన్‌కు అనుమతి ఇవ్వాలని కోరారు. ఎక్స్‌టెన్షన్‌కు అనుమతి ఇస్తే మిల్లర్లు తమ వద్ద ఉన్న ధాన్యానికి ప్రతి గింజకు బాధ్యత వహించి సీఎంర్‌ను పూర్తిగా చెల్లించేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. మిల్లర్లకు రావాల్సిన చార్జీలను సకాలంలో చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని, 25 శాతం ఫెనాల్టీ, 12 శాతం వడ్డీని మాఫీ చేసి రైస్ మిల్లు పరిశ్రమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి బి శశికిరణ్, కోశాధికారి గిరిధర్‌లాల్ దోడియా, ఉపాధ్యక్షులు కె కేశవరెడ్డి, కె మల్లిఖార్జున్, వి మల్లన్న, విజయేందర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులు టి అశోక్‌రావు, వి వీరకుమార్, పి సదానందర్, బి తిరుపతి, అడ్వైజర్లు కె మోహన్‌రావు, కె వెంకటయ్య, కో-ఆప్షన్ మెంబర్లు ఎస్ వీరభద్రరావు, ఆర్ అమర్ పాల్గొన్నారు.