Share News

సురేఖ మాజీ ఓఎస్‌డీ తండ్రి ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:30 AM

మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎ్‌సడీ సుమంత్‌ తండ్రి నార్ల సుబ్రహ్మణ్యం (61) ఆత్మహత్యాయత్నం చేశారు. హనుమకొండ ప్రకాశ్‌రెడ్డిపేటలోని నివాసంలో గురువారం రాత్రి అల్ర్పాజోలం మాత్రలను ఆయన పెద్ద మొత్తంలో మింగినట్లు తెలుస్తోంది.

సురేఖ మాజీ ఓఎస్‌డీ తండ్రి ఆత్మహత్యాయత్నం
Subrahmanyam

  • పెద్దమొత్తంలో అల్ర్పాజోలం మాత్రలు మింగిన నార్ల సుబ్రహ్మణ్యం

  • అర్ధరాత్రి తర్వాత ఆస్పత్రికి..

  • వెంటిలేటర్‌పై చికిత్స.. విషమం

వరంగల్‌ మెడికల్‌, హనుమకొండ టౌన్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎ్‌సడీ సుమంత్‌ తండ్రి నార్ల సుబ్రహ్మణ్యం (61) ఆత్మహత్యాయత్నం చేశారు. హనుమకొండ ప్రకాశ్‌రెడ్డిపేటలోని నివాసంలో గురువారం రాత్రి అల్ర్పాజోలం మాత్రలను ఆయన పెద్ద మొత్తంలో మింగినట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి ఒంటిగంటకు సుబ్రహ్మణ్యం మరో కుమారు డు (సుమంత్‌ సోదరుడు) ఆయనకు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో పక్కింటివాళ్లకు ఫోన్‌ చేసి అలర్ట్‌ చేశారు. వారొచ్చి చూడగా పడక మీద 60 అల్ర్పాజోలం మాత్రలు ఉన్న రెండు షీట్లు కనిపించాయి.


ఆయన్ను నిద్రలేపేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో వారు తెల్లవారుజామున 2:30కు హంటర్‌ రోడ్డులోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. సుబ్రహ్మణ్యం వేసుకున్నట్లుగా భావిస్తున్న మాత్రల తాలూకు షీట్లను వైద్యులకు అందజేశారు. వైద్యులు సుబ్రహ్మణ్యాన్ని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని, అయినా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్యాయత్నం చేసినట్లు భావిస్తున్నారు. సుబ్రహ్మణ్యం కుమారుడు, మాజీ మంత్రి కొండా సురేఖ ఓఎ్‌సడీ సుమంత్‌పై హత్యాయత్నం ఆరోపణలొచ్చాయి.


గత నెల 30న జూబ్లీహిల్స్‌లోని కార్యాలయానికి రియల్టర్‌ హరికృష్ణను పిలిచిన సుమంత్‌ ఆతడిపై రాడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ ఘటన అనంతరం సుమంత్‌ పరారీలో ఉండగా అతడికి సహకరించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబందించి నాంపల్లి సెషన్‌ కోర్టు సుమంత్‌తో పాటు మరో ఇద్దరికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.


రూ.25వేల పూచీకత్తుతో జూబ్లీహిల్స్‌ పోలీసుల ముందు హాజరుకావాలని అతడిని కోర్టు ఆదేశించింది. ఆ మేరకు సుమంత్‌ గురువారం లాయర్లతో కలిసి పోలీస్‌ స్టేషన్‌లో హాజరయ్యారు. సుమంత్‌ అంతకుముందు కూడా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా హత్యాయత్నం కేసులో ఇరుక్కోవడంతో సుబ్రహ్మణ్యం తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యాయత్నం చేశారని భావిస్తున్నారు. గతంలోనూ ఓసారి ఆయన ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.


పోలీసుల వేధింపులతోనే: సుమంత్‌ భార్య

పోలీసుల వేధింపుల కారణంగా తమ కుటుంబసభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని సుమంత్‌ భార్య డాక్టర్‌ మనీషా ఆరోపించారు. సుమంత్‌పై వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేకే సుబ్రహ్మణ్యం 60 నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఓ వీడియో ద్వారా ఆమె తెలిపారు. గత 20 రోజులుగా తమను, బంధువులను, స్నేహితులను, డ్రైవర్‌ను వేధిస్తున్నారని, 20 నుంచి 30 మంది పరిచయస్తులను పిలిచి విచారించారని ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ప్రజల గుండెలపై కుంపటిలా సెక్షన్లు!
కోర్సు పూర్తి చేస్తేనే డ్రైవింగ్‌ లైసెన్స్‌!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 12 , 2026 | 05:30 AM