చెప్పినట్టు వినకుంటే.. కొలువు పీకేయిస్తా!
ABN , Publish Date - Sep 12 , 2026 | 06:17 AM
నేను చెప్పిందే వేదం... నేను చెప్పినట్టే అందరూ వినాలి... లేకుంటే ఉద్యోగంలో నుంచి పీకేయిస్తా’ అంటూ ఓ అధికారి మహిళా ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
హిళా ఉద్యోగులకు ఓ అధికారి వేధింపులు
సంగారెడ్డి కలెక్టర్, ఎస్పీలకు సిబ్బంది ఫిర్యాదు
సంగారెడ్డి క్రైం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘నేను చెప్పిందే వేదం... నేను చెప్పినట్టే అందరూ వినాలి... లేకుంటే ఉద్యోగంలో నుంచి పీకేయిస్తా’ అంటూ ఓ అధికారి మహిళా ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని మహిళా సిబ్బంది శుక్రవారం కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను, ఎస్పీ పరితోష్ పంకజ్‌లను కలిసి గోడును విన్నవించుకున్నారు.
అడ్మినిస్ట్రేటివ్ అధికారి అయిన ఆయన.. మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నాడని ఆరోపించారు. కలెక్టర్ స్పందించి విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా ఉద్యోగులకు పనిచేసే చోటనే రక్షణ లేకుండా పోయిందని, తమకు ప్రాణ రక్షణ కల్పించాలని బాధిత ఉద్యోగులు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్‌కు విన్నవించారు. కాగా, ఆ ఉన్నతాధికారి మహిళా ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పై కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమగ్ర విచారణ జరిపి తగు న్యాయం చేస్తానని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అనలాగ్ పనీర్‌పై నిషేధం
ట్రాక్టర్లపై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News