విమలక్క కళా ప్రస్థానంపై 50 గంటల ప్రజా కళా జాతర
ABN , Publish Date - Sep 12 , 2026 | 06:41 AM
ప్రజా సాంస్కృతిక ఉద్యమంలో అరుణోదయ విమలక్క 50 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో 50 గంటల ప్రజాకళా జాతర జరుగనున్నది.
పంజాగుట్ట, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ప్రజా సాంస్కృతిక ఉద్యమంలో అరుణోదయ విమలక్క 50 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో 50 గంటల ప్రజాకళా జాతర జరుగనున్నది. విమలక్కతో కలిసి ప్రజా కళా జాతర ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, అధ్యక్షురాలు ప్రొఫెసర్ కె.లక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఆచార్య కట్టా భగవంతరెడ్డి ఈ కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు.
అరుణోదయ విమలక్క ప్రజా సాంస్కృతికోద్యమ ప్రస్థానం, విప్లవ సాంస్కృతికోద్యమ దశాదిశ పేరుతో ఓ పుస్తకం కూడా ఆవిష్కరిస్తామన్నారు. 50 గంటలు సాగే ఈ కార్యక్రమంలో 50 మంది ఉపన్యాసకుల విశ్లేషణలు, అనుభవాల మేళవింపుతోపాటు వివిధ ప్రజా కళారూపాలకు వేదిక కల్పించనున్నట్లు వెల్లడించారు. 26న సుందరయ్య పార్కు నుంచి ఆర్టీసీ కల్యాణ మండపం వరకు భారీ ఊరేగింపు ఉంటుందని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పారిశ్రామికవేత్తలకు బీఆర్‌ఎస్ బెదిరింపులు
Read Latest AP News And Telangana News And International News And Telugu News