నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-1లో కొత్త సర్వీసులు
ABN , Publish Date - Sep 12 , 2026 | 08:31 AM
రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం గ్రూప్ వన్ సర్వీసులో మరిన్ని సర్వీసులు చేర్చుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి, సెప్టెంబర్12: రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం గ్రూప్ వన్ సర్వీసులో మరిన్ని సర్వీసులు చేర్చుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ జారీ చేశారు.
డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఎపీ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది), జిల్లా అగ్నిమాపక అధికారి (ఎపీ ఫైర్ సర్వీసెస్) అసిస్టెంట్ డైరక్టర్, ప్రాజెక్టు అధికారి(ఎపీ అడల్ట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్), డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (కమ్యూనికేషన్స్) (ఏపీ పోలీసు సర్వీస్), జిల్లా విద్యాశాఖాధికారి (ఏపీ ఎడ్యుకేషన్ సర్వీసు)ల పోస్టులను గ్రూప్ వన్ సర్వీసులో చేర్చారు.
ఈ మార్పులతో గ్రూప్ వన్ సర్వీసు పోస్టుల సంఖ్య 22కి చేరింది. అలాగే మండల ప్రజాపరిషత్ డెవలప్‌మెంట్ అధికారి (ఏపీ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి) పోస్టును గ్రూప్ వన్ సర్వీస్ జాబితా నుంచి తొలగించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ సర్వీస్ రిక్రూట్‌మెంట్‌లో ఈ క్లాసిఫీకేషన్ వర్తిస్తుందని జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాతపరీక్ష లేకుండానే పోస్టాఫీస్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి!
పీజీఈసెట్ తుదివిడత కౌన్సెలింగ్‌లో జాప్యం.!
For More Education News And Telugu News