పీజీఈసెట్ తుదివిడత కౌన్సెలింగ్‌లో జాప్యం.!
ABN , Publish Date - Sep 09 , 2026 | 08:21 AM
పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఇంజనీరింగ్ (ఎంటెక్) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొంది.
సీట్ అలాట్‌మెంట్ రేపటికి వాయిదా
హైదరాబాద్ సిటీ: పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఇంజనీరింగ్ (ఎంటెక్) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొంది. తాజాగా ఈనెల 10తేదీ సాయంత్రం 5గంటల తర్వాత సీట్ అలాట్‌మెంట్‌ను విడుదల చేస్తామని అధికారులు పీజీఈసెట్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. జూన్ 25న ప్రవేశాల కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ అయింది. అయితే,
ఆగస్టు 25న ప్రారంభమైన తుదివిడత కౌన్సెలింగ్ షెడ్యూలు మేరకు ఈ నెల 5 సీట్ల కేటాయింపులు ప్రకటించాల్సి ఉంది. నాలుగు రోజులుగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కేటాయింపులు వాయిదా పడడంతో నిరాశ తప్పలేదు. కౌన్సెలింగ్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయని కారణంగా తరగతులు ఆలస్యంగా ప్రారంభం అవుతున్నాయని, దీంతో తాము ప్లేస్‌మెంట్ అవకాశాలను కోల్పోవాల్సి వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం ధరల్లో ఊగిసలాట.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..
‘ఇందిరమ్మ’ లాటరీలో ఇళ్లురాని వారికి ధరావతు వాపస్
Read Latest AP News And Telangana News And International News And Telugu News