Share News

టిబెట్‌లో భూకంపం.. నేపాల్‌లో కంపించిన భూమి..

ABN , Publish Date - Sep 09 , 2026 | 07:20 AM

టెబెట్‌లో బుధవారం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైందని యూరోపియన్ మెడటేరియనియన్ సెస్మాలాజికల్ సెంట్రల్ తెలిపింది.

టిబెట్‌లో భూకంపం.. నేపాల్‌లో కంపించిన భూమి..
Tibet earthquake

ఇంటర్‌నెట్ డెస్క్: టెబెట్‌లో బుధవారం భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైందని యూరోపియన్ మెడటేరియనియన్ సెస్మాలాజికల్ సెంట్రల్ తెలిపింది. భూమికి 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. టిబెట్‌లో వచ్చిన భూకంపం కారణంగా నేపాల్‌లో భూప్రకంపనలు సంభవించాయని వెల్లడించింది. అయితే, టిబెట్‌లో వచ్చిన భూకంపం తాలూకా తీవ్రత 5.0 మాత్రమేనని ఇండియాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది.


భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందా లేదా అన్నదానిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గత గురువారం కూడా టిబెట్‌లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది.


ఇవి కూడా చదవండి

ఆసియా క్రీడలు.. అవి ఫైవ్‌స్టార్ కాకపోయినా మంచి హోటళ్లే: బీసీసీఐ

బంగారం ధరల్లో ఊగిసలాట.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 09 , 2026 | 07:26 AM