బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో సమస్య.. 1000 విమానాల రద్దు..
ABN , Publish Date - Sep 09 , 2026 | 08:01 AM
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో సాంకేతిక సమస్య కారణంగా బ్రిటన్ వ్యాప్తంగా భారీ సంఖ్యలో విమానాలు రద్దయ్యాయని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్ రాడార్ 24 తెలిపింది. మంగళవారం ఒక్కరోజే 1000 విమానాలు రద్దయ్యాయని వెల్లడించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో సాంకేతిక సమస్య కారణంగా బ్రిటన్ వ్యాప్తంగా భారీ సంఖ్యలో విమానాలు రద్దయ్యాయని ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్ రాడార్ 24 తెలిపింది. మంగళవారం ఒక్కరోజే 1000 విమానాలు రద్దయ్యాయని వెల్లడించింది. విమానాలు రద్దు కావటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొంది. ఎయిర్‌పోర్ట్ రన్‌వేలపై, టెర్మినల్స్‌లో గంటలపాటు ఎదురు చూడాల్సి వచ్చిందని తెలిపింది.
బ్రిటన్ నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్ అధికారులు స్పందిస్తూ.. మంగళవారం సాయంత్రానికి ఫ్లైట్ ప్రాసెసింగ్ సిస్టమ్‌లోని సమస్యను పరిష్కరించామని తెలిపారు. యూకే వ్యాప్తంగా రద్దయిన విమానాలను క్లియర్ చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. జోసీ డోనోగ్ అనే ప్రయాణికురాలు మీడియాతో మాట్లాడుతూ... ‘ఎయిర్‌పోర్టు నుంచి బయటపడ్డం.. ద్వీపం నుంచి బయటపడ్డంలాగా అనిపించింది. ఆ అనుభవం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. పీడకల అని చెబుతాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
విమానాలు రన్‌వేలపై ఆగిపోవటంతో లోపల ఉన్న ప్రయాణికులు నరకం చూశారు. హీత్రూ నుంచి బాల్తిమోర్ వెళ్లాల్సిన బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం రన్‌వేపై ఆగిపోయింది. లాంగ్ డిలే కారణంగా విమాన సిబ్బంది ప్రయాణికులకు పాస్తా, చికెన్ కర్రీ తినడానికి ఇచ్చారు. కిందకు దిగే అవకాశం లేకపోవటంతో కొంతమంది ప్రయాణికులు నిద్రపోగా.. మరి కొందరు సినిమాలు చూస్తూ గడిపారు.
ఇవి కూడా చదవండి
‘ఇందిరమ్మ’ లాటరీలో ఇళ్లురాని వారికి ధరావతు వాపస్
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ దూరం.. కారణమిదే!