లోన్ చెల్లించలేదని.. కుమార్తె ఫొటోలు మార్ఫింగ్ చేసి..
ABN , Publish Date - Sep 09 , 2026 | 07:50 AM
తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో లోన్ యాప్ నిర్వాహకులు బరితెగించారు. కుమార్తె ఫొటోలు మార్ఫింగ్ చేశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ లోన్ తీసుకున్న మహిళను యాప్ నిర్వాహకులు బెదిరించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 09: తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో లోన్ యాప్ నిర్వాహకులు బరితెగించారు. కుమార్తె ఫొటోలు మార్ఫింగ్ చేశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ లోన్ తీసుకున్న మహిళను యాప్ నిర్వాహకులు బెదిరించారు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ బోడుప్పల్‌లోని రాజలింగం కాలనీకి చెందిన మహిళ.. బంధువుల కోసం వర్ధన్ యాప్‌లో నగదు రుణం తీసుకుంది. గత కొద్దిరోజులుగా ఆమె ఈఎంఐ చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ మహిళకు యాప్ నిర్వాహకులు ఫోన్ చేసి తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. సెల్ నంబర్ బ్లాక్ చేసినా.. ఇతర నంబర్ల నుంచి ఫోన్ చేసి ఆమెను వేధిస్తున్నారు.
దీంతో 10వ తరగతి చదువుతున్న ఆమె కుమార్తె ఫొటోలను ఆ యాప్ నిర్వాహకులు మార్ఫింగ్ చేశారు. వాటిని కన్నతల్లి వాట్సాప్‌కి పంపారు. లోన్ చెల్లించకుంటే.. కుమార్తె ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో లోన్ యాప్ నిర్వాహకులపై మేడిపల్లి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎస్ఐనంటూ నగల షాపు యజమానికి ఫోన్.. రూ.50 వేలు డిమాండ్
సర్క్యులర్‌లోని ధరకే రొయ్యల మేత విక్రయించండి
For More TG News And Telugu News