ఇళ్ల ముందు ‘విజిల్’ ముగ్గులు
ABN , Publish Date - Apr 18 , 2026 | 11:34 AM
ప్రతి ఇంటి గుమ్మం ముందు ‘విజిల్’ గుర్తుతో రంగవల్లికలు వేయాలంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్ పిలుపు మేరకు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది.
విజయ్ పిలుపునకు విశేష స్పందన
పెరంబూరు నియోజకవర్గ కార్యాలయాన్ని సందర్శించిన విజయ్
స్వయంగా ముగ్గు వేసిన టీవీకే అధినేత
చెన్నై: ప్రతి ఇంటి గుమ్మం ముందు ‘విజిల్’ గుర్తుతో రంగవల్లికలు వేయాలంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్ పిలుపు మేరకు అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. క్షేత్రస్థాయిలో ప్రచారానికి వెళ్లని విజయ్.. పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కొత్తగా పిలుపు ఇస్తున్నారు. ఆ ప్రకారం, కొద్దిరోజులక్రితం ‘మీలో ప్రతిఒక్కరూ ఒక విజయ్, ఒక్కో మహిళ ఒకవిజీ, ప్రతి ఒక్కరి ఇంట్లో విజయ్ ఉంటాడు’ అంటూ ప్రసంగించారు. నగరంలో గురువారం నిర్వహించిన ఎన్నికల మెనిఫెస్టో విడుదల కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ... ఎన్నికలకు ఇంకా వారం రోజులు మాత్రమే ఉందని, అందువల్ల తమ కార్యకర్తలంతా ఇళ్ల ముందు ‘విజిల్’ ముగ్గు వేసి ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు రాష్ట్రంలో పలు చోట్ల ఇళ్ల ముంగిట విజిల్ ముగ్గులు కనిపించాయి.
స్వయంగా ముగ్గు వేసిన విజయ్
పెరంబూరు నియోజకవర్గంలోని జవహర్ నగర్‌లో వున్న తన పార్టీ కార్యాలయానికి వెళ్లిన విజయ్‌కు అభిమానులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ముందుగా కార్యక్రమంలో తన అనుచరులతో మాట్లాడిన విజయ్.. వారికి ప్రచారంపై పలుసూచనలు చేశారు. ఈసందర్భంగా కొంతమంది మహిళా కార్యకర్తలు విజయ్‌ను విజిల్ ముగ్గువేయాలని కోరగా అందుకు ఆయన సమ్మతించారు. అనంతరం చుట్టుపక్కల వున్న కొన్ని ఇళ్లకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ విషయం తెలిసి వందలాదిమంది కార్యకర్తలు అక్కడకు చేరుకుంటుండడంతో.. విజయ్ అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అక్షయ తృతీయకు ముందు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం, వెండి
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
Read Latest Telangana News and National News