తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్
ABN , Publish Date - Apr 18 , 2026 | 10:05 AM
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు నేడు పిలుపునివ్వడంతో ఈరోజు ఉదయాన్నే రాంచందర్ రావు ఇంటికి వెళ్లిన పోలీసులు గుహ నిర్బంధం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు నేడు పిలుపునివ్వడంతో ఈరోజు ఉదయాన్నే రాంచందర్ రావు ఇంటికి వెళ్లిన పోలీసులు గుహ నిర్బంధం చేశారు. లోక్ సభలో నిన్న(శుక్రవారం) మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందంటూ రేవంత్ ఇంటి ముట్టడికి బీజేపీ సిద్ధమైంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. మరోవైపు పోలీసులు తనను నిర్బంధించడంపై ఆయన ఆగ్రహించారు. నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్‌ను వదిలిపెట్టేది లేదని రాంచందర్ రావు హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ వైఖరికి నిరసనగా ఈరోజు దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చామన్నారు. పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేశారని, అయినా తమ పార్టీ శ్రేణులు, నాయకులు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తారని హెచ్చరించారు. దేశంలో ఇంకా రాచరిక పాలన కావాలని కాంగ్రెస్ భావిస్తోందని మండిపడ్డారు. ఒక్క ముస్లిం సమాజానికి మేలు చేసేందుకు ఈ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. దేశ ప్రజలు, తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పెరుగు తెచ్చిన లొల్లి.. వివాహిత అదృశ్యం..
లోకేశ్ మనసును కదిలించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ ట్వీట్