వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
ABN , Publish Date - Apr 18 , 2026 | 09:56 AM
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ గ్యాంగ్‌తో భర్తను చంపించిందో మహిళ. ఇందుకు తన ప్రియుడు, సోదరుడి సహకారాన్ని తీసుకుందామె.
సుపారీ గ్యాంగ్‌తో భర్తను హత్య చేయించిన భార్య
రూ.5లక్షలకు ఒప్పందం.. సహకరించిన ప్రియుడు, సోదరుడు
వరంగల్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ గ్యాంగ్‌తో భర్తను చంపించిందో మహిళ. ఇందుకు తన ప్రియుడు, సోదరుడి సహకారాన్ని తీసుకుందామె. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ వివరాలను వెల్లడించారు. హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన మడికొండ సుమన్ భరత్ 2012లో లావణ్యను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పరకాలకే చెందిన ఇమ్మడి నరేశ్ అనే వ్యక్తితో లావణ్యకు పరిచయం ఏర్పడి.. అది వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఇది భర్తకు తెలియడంతో రోజూ మద్యం తాగొచ్చి లావణ్యను కొట్టేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేని లావణ్య.. ఎంత డబ్బయినా పర్వాలేదు.. తన భర్తను చంపాలని ప్రియుడు నరేశ్‌కు, తమ్ముడు పెండల రాజుకు చెప్పింది. ఆ ఇద్దరు తమకు పరిచయం ఉన్న ములుగు జిల్లా గోవిందరావుపేట మండలానికి చెందిన చిరంశెట్టి వెంకటేశ్వర్లు, భూక్య నరేశ్‌లను కలిశారు. సుమన్ భరత్‌ను హత్య చేస్తే రూ.5లక్షలు ఇస్తామని చెప్పడంతో వారు అంగీకరించారు. లావణ్య బంగారం కుదవపెట్టి రూ.4.59 లక్షలను నరేశ్, రాజుతో వెంకటేశ్వర్లుకు ఇప్పించింది. ఈ నెల 3న భరత్‌కు మద్యం, డబ్బుల ఆశచూపి వెంకటేశ్వర్లు, నరేశ్ గోవిందరావుపేటకు పిలిపించుకున్నారు.
భరత్‌కు మద్యం తాగించి తలపై బీరు సీసాతో కొట్టగా కిందపడిపోయాడు. పెట్రోల్‌ను అతడి ఒంటిపై పోసి నిప్పంటించారు.. ఆ దృశ్యాలను ఫోన్‌లో వారు వీడియో తీశారు. అనంతరం మృతదేహం అవశేషాలను పక్కనే ఉన్న దయ్యాల వాగులో పడేశారు. మరుసటిరోజు లావణ్య, పెండల రాజు ములుగుకు రాగా, వారికి ఆ వీడియో చూపించారు. మిగతా రూ.41వేలను వెంకటేశ్వర్లుకు ఇచ్చారు. మృతుడి తండ్రి సాంబయ్య ఈనెల 8న ఆమెపై అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసుల విచారణ జరపగా హత్య విషయం వెలుగులోకొచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి:
అక్షయ తృతీయకు ముందు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం, వెండి
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు
Read Latest Telangana News and National News