Share News

నల్లగా ఉన్నారన్న బంధువు.. ఆత్మహత్య చేసుకున్న మహిళ..

ABN , Publish Date - Apr 18 , 2026 | 08:38 AM

నువ్వు, నీ పిల్లలు నల్లగా ఉన్నారంటూ సమీప బంధువు దూషణలతో మానసికంగా కుంగిపోయిన గృహిణి ఆత్మహత్య చేసుకుంది.

నల్లగా ఉన్నారన్న బంధువు.. ఆత్మహత్య చేసుకున్న మహిళ..
Hyderabad, Crime News

హైదరాబాద్: నువ్వు, నీ పిల్లలు నల్లగా ఉన్నారంటూ సమీప బంధువు దూషణలతో మానసికంగా కుంగిపోయిన గృహిణి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ స్రవంతి నగర్‌లో నివసించే పి.విష్ణు డ్రైవర్‌. భార్య లక్ష్మి(21), ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా సమీప బంధువు సంజీవ నల్లగా ఉన్నారంటూ లక్ష్మీతో పాటు పిల్లల గురించి కామెంట్‌ చేసేవాడు.


city4.2.jpgరోజురోజుకూ దూషణలు పెరగడంతో మనస్తాపానికి గురైన లక్ష్మి ఈ నెల 16న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఫిర్యాదు మేరకు సంజీవపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అక్షయ తృతీయకు ముందు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం, వెండి

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 18 , 2026 | 08:49 AM