తూర్పుగోదావరికి సీఎం చంద్రబాబు.. నేటి షెడ్యూల్ ఇదే..
ABN , Publish Date - Apr 18 , 2026 | 07:53 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర సహా పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు.
తూ.గో.జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(శనివారం) తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర సహా పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ విడుదలైంది. ఈరోజు ఉదయం 10:30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు నిడదవోలుకు ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. 11:20 గంటలకు సుబ్బరాజుపేటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
మధ్యాహ్నం 1:50 గంటలకు మలకోడు సరస్సును సందర్శించి స్థానికులు, శాస్త్రవేత్తలు, నిపుణులతో మాట్లాడనున్నారు. అనంతరం నిడదవోలు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఎస్టీ అంబ్రోస్ స్కూలు సమీపంలో వారితో పలు కీలక అంశాలను చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 4:45 గంటలకు తిరిగి అమరావతికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రతిపక్షాలపై మంత్రి లోకేశ్ ఆగ్రహం.. దక్షిణ భారత్‌కు నష్టమే అంటూ వ్యాఖ్య