హిట్ అండ్ రన్ కేసులో లొంగిపోయిన రాహెల్
ABN , Publish Date - Apr 18 , 2026 | 09:06 AM
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు కీలక మలుపు తిరిగింది. జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ లొంగిపోయాడు.
హైదరాబాద్: సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు కీలక మలుపు తిరిగింది. జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ లొంగిపోయాడు. 2022లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ హిట్ అండ్ రన్ కేసులో కీలక నిందితుడుగా రాహెల్ ఉన్నాడు.
అయితే, అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. జూబ్లీహిల్స్ పోలీసులకు లొంగిపోవాలని రాహెల్‌ను కోర్టు ఇటీవల ఆదేశించింది. దీంతో ఇవాళ(శనివారం) అతను పోలీసులకు సరెండర్ అయ్యాడు. వెంటనే అతన్ని న్యాయస్థానంలో హాజరుపరిచారు పోలీసులు. విచారణ చేపట్టిన కోర్టు హిట్ అండ్ రన్ కేసులో రాహెల్‌కి బెయిల్ మంజూరు చేసింది.
కాగా, 2022 మార్చి 18 తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫుట్ పాత్‌పై ఉన్న నాలుగున్నరేళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ కేసులో రాహెల్ నిందితుడిగా ఉన్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి
30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించండి
పెరుగు తెచ్చిన లొల్లి.. వివాహిత అదృశ్యం..