తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన పసిడి, వెండి ధరలు
ABN , Publish Date - Apr 18 , 2026 | 10:38 AM
భారత్‌లో నిన్న కాస్త తగ్గిన పసిడి ధరలు నేడు మరోసారి పెరిగాయి. మరి వివిధ నగరాల్లో ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ అనిశ్చితులతో పాటు దేశీయంగా అక్షయ తృతీయ సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. మూడు రోజుల ర్యాలీ తరువాత నిన్న కాస్త తగ్గిన ధరలు నేడు (ఏప్రిల్ 18) మరోసారి పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నేడు ఉదయం 10.30 గంటల సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.810ల మేర పెరిగి రూ.1,55,780కు చేరుకుంది. 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ.750 మేర పెరిగి రూ.1,42,800కు చేరుకుంది. వెండి ధరలో కూడా రూ.5 వేల మేర పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం నగరంలో కిలో వెండి ధర రూ.2.8 లక్షలుగా ఉంది.
ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,56,660గా ఉంది. ఢిల్లీలో రూ.1,55,930గా, ముంబైలో రూ.1,55,780గా ఉంది. ఆర్నమెంటల్ పసిడి ధర చెన్నైలో రూ.1,43,600 వద్ద కదలాడుతోంది. ఢిల్లీలో రూ.1,42,950గా, ముంబైలో రూ.1,42,800గా ఉంది. ఇక దేశవ్యాప్తంగా నేడు వెండి రేటు సగటున రూ.10 వేల మేర పెరిగింది. ప్రస్తుతం వివిధ నగరాల్లో వెండి (కిలో) ధరలు రూ.2.75 లక్షలు - రూ.2.80 లక్షల మధ్య కదలాడుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఆసియా కుబేరుడు అదానీ.. అంబానీని అధిగమించి నెం.1గా..
పసిడి దిగుమతులు రూ.6.68 లక్షల కోట్లు