Share News

పవన్‌ సగం...జగన్‌ సగం...!!!

ABN , Publish Date - Apr 17 , 2026 | 11:21 AM

టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్‌ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న తరుణంలో, ఆయన ప్రచార సరళిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

పవన్‌ సగం...జగన్‌ సగం...!!!
TVK Vijay, YS Jagan, Pavan Kalyan

  • రాజకీయాల్లోనూ రీమేకేనా?

  • విజయ్‌పై నెటిజన్ల విమర్శలు

చెన్నై: టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్‌ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న తరుణంలో, ఆయన ప్రచార సరళిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా, ప్రచారంలో విజయ్‌ చేపడుతున్న కొన్ని ఘటనలు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజకీయ నేతలను పోలి ఉన్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రధానంగా, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డిని విజయ్‌ కాపీ కొడుతున్నారంటున్నారు.


రానున్న ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్న విజయ్‌, తన ప్రచారంలో కార్యకర్తలు, ప్రజల దృష్టి ఆకర్షించేలా, సైకిల్‌ తొక్కడం, చిన్నారులను భుజంపై ఎత్తుకోవడం, కండువా తిప్పడం, బాణం గురిపెట్టడం తదితరాలు చేపడుతున్నారు. ఇలాంటివి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నా, సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.


nani4.2.jpg‘ఏంటి బ్రో.... గతంలో పవన్‌ కల్యాణ్‌ తన ప్రచారంలో ఇలాంటివే వినియోగించారు. మాజీ సీఎం జగన్‌ స్టైల్లో ఫోజులిస్తున్నారు... మీరు ఆంధ్ర రాజకీయ నేతల్లా మారారు... ఇది తమిళనాడు... జాగ్రత్త బ్రో’.... సినిమాల్లాగే రాజకీయాల్లో కూడా రీమేక్‌ సీన్లు వుంటే ఎలా?’ అంటూ దెప్పిపొడుస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఇది ట్రైలర్‌ మాత్రమే.. మెయిన్‌ పిక్చర్‌ చూడాలని ఆశపడొద్దు

గ్యాస్‌ కొరతతో నిలిచిన ఆటోలు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 17 , 2026 | 11:21 AM