ఉదయనిధి వాహనం తనిఖీ
ABN , Publish Date - Apr 17 , 2026 | 10:10 AM
ప్రచారానికి వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి కారును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు.
చెన్నై: ప్రచారానికి వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి కారును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు. కోవిల్‌పట్టి నియోజకవర్గంలో పోటీచేస్తున్న డీఎంకే అభ్యర్థి కరుణానిధికి మద్దతుగా ప్రచారం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి కయత్తారు నుంచి కోవిల్‌పట్టి చేరుకుని ఓ హోటల్‌లో బసచేశారు.
అనంతరం అక్కడి నుంచి ఉదయనిధి బయల్దేరిన వాహనాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు. ఉదయనిధి వాహనం నుంచి దిగి అధికారులకు సహకరించారు. తనిఖీల అనంతరం ఉదయనిధి అక్కడి నుంచి బయల్దేరి వెళ్లారు.
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్ రేట్స్.. కొనసాగుతున్న ధరలు పెరుగుదల
నోయిడా అల్లర్లు.. ఇద్దరి అరెస్టు, మరొకరు పరారీ..
Read Latest Telangana News and National News