తీవ్ర విషాదం.. బావిలో మునిగిపోయిన బాలుడు.. కాపాడేందుకు వెళ్లి..
ABN , Publish Date - Apr 17 , 2026 | 09:06 AM
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం అరవ కొత్తూరు గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది.
తిరుపతి: శ్రీకాళహస్తి మండలం అరవ కొత్తూరు గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. గ్రామానికి చెందిన ఐదో తరగతి విద్యార్థి త్రిశూల్(12) ఈత నేర్చుకునేందుకు స్నేహితులతో కలిసి బావి వద్దకు వెళ్లాడు. ఈత వచ్చిన తన స్నేహితులు బావిలోకి దిగగా.. ఈత రాకుండానే బాలుడు దూకేశాడు. దీంతో వెంటనే ముగినిపోయాడు. అతన్ని కాపాడేందుకు చిన్నారులు ప్రయత్నించగా.. వారి వల్ల కాలేదు. బాలుడు మునిగిపోవడం గమనించిన తరుణ్ రెడ్డి(25) అనే వ్యక్తి కాపాడేందుకు బావిలోకి దిగాడు.
అయితే, త్రిశూల్, తరుణ్ రెడ్డి ప్రమాదవశాత్తూ మృతిచెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒంటిపూట బడులు, వేసవి సెలవుల నేపథ్యంలో చిన్నారుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలం ఈత సరదా కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని, పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ పనుల నిమిత్తం బయటకు వెళ్తే ఇంట్లో ఉన్న పెద్దవారికి గానీ లేదా పక్కింటి వారికైనా చిన్నారులను అప్పగించి వెళ్లాలని సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
భీమిలి సమీపంలో రోడ్డు ప్రమాదాలు.. ఒకరి మృతి, పలువురికి గాయాలు