గ్యాస్ కొరతతో నిలిచిన ఆటోలు
ABN , Publish Date - Apr 17 , 2026 | 10:35 AM
చెన్నై నగరంలో మళ్లీ గ్యాస్ కొరత ఏర్పడింది. తమ వాహనాలకు ఎల్‌పీజీ, సీఎన్‌జీ అందుబాటులో లేకపోవడంతో డైవ్రర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సీఎన్జీ స్టేషన్ల వద్ద బారులు
చెన్నై: నగరంలో మళ్లీ గ్యాస్ కొరత ఏర్పడింది. తమ వాహనాలకు ఎల్‌పీజీ, సీఎన్‌జీ అందుబాటులో లేకపోవడంతో డైవ్రర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నై నగరంలో, వేలాది ఆటోలు, కాల్ ట్యాక్సీలు ఎల్‌పీజీ, సీఎన్‌జీతో నడుస్తున్నాయి. అదేవిధంగా, అనేక తేలికపాటి వాణిజ్య వాహనాలు, ప్రజా రవాణా బస్సులు కూడా ఇప్పుడు సీఎన్‌జీతో నడుస్తున్నాయి.
ఇంధనం నింపే కేంద్రాలు తాత్కాలికంగా మూతబడటంతో ఆటో-రిక్షా డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా, అనేక ప్రాంతాల్లో, డైవ్రర్లు తమ వాహనాలకు ఇంధనం నింపుకోవడానికి ఎక్కువసేపు వేచి ఉండవలసి వస్తోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నగరంలో ఎక్కడ చూసినా ఆటోలు బారులు తీరి కనిపించాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
ఇది ట్రైలర్ మాత్రమే.. మెయిన్ పిక్చర్ చూడాలని ఆశపడొద్దు
నోయిడా అల్లర్లు.. ఇద్దరి అరెస్టు, మరొకరు పరారీ..
Read Latest Telangana News and National News