Share News

రాజకీయాల్లో విజయ్‌ ‘లాలీపాప్‌’ తింటున్న పిల్లోడే

ABN , Publish Date - Apr 17 , 2026 | 11:52 AM

రాజకీయాల్లో టీవీకే అధ్యక్షుడు విజయ్‌ లాలీపాప్‌ తింటున్న పిల్లోడేనని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విమర్శించారు.

రాజకీయాల్లో విజయ్‌ ‘లాలీపాప్‌’ తింటున్న పిల్లోడే
premalatha, Chennai

  • ప్రేమలత

చెన్నై: రాజకీయాల్లో టీవీకే అధ్యక్షుడు విజయ్‌ లాలీపాప్‌ తింటున్న పిల్లోడేనని డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విమర్శించారు. సేలం కోట ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో ఆమె డీఎంకే కూటమి అభ్యర్థులను అధిక స్థానాల్లో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ నేతృత్వంలో అమలుపరిచిన పథకాలకు మహిళల్లో ఆదరణ పెరిగిందన్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన వెంటనే సీఎం సీటులో కూర్చోవాలని టీవీకే అధ్యక్షుడు విజయ్‌ కలలు కంటున్నాడని,


nani5.2.jpgఎంతోమంది సీనియర్‌ నటులు రాజకీయాల్లోకి వచ్చి ఏమైపోయారో అందరికి తెలుసన్నారు. ఈ రాష్ట్రంలో 75యేళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన రాజకీయ పార్టీలు ఒంటరిగా పోటీచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో తాను సీఎం అవుతానని విజయ్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, రాజకీయాల్లో విజయ్‌ లాలీపాప్‌తింటున్న పిల్లోడేనని ఆమె ఎద్దేవాచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఇది ట్రైలర్‌ మాత్రమే.. మెయిన్‌ పిక్చర్‌ చూడాలని ఆశపడొద్దు

గ్యాస్‌ కొరతతో నిలిచిన ఆటోలు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 17 , 2026 | 11:52 AM