Share News

3న చెన్నైకి ప్రధాని మోదీ?

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:44 PM

భారత ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్‌ 3న చెన్నై రానున్నట్లు తెలిసింది. ఆ రోజు పుదుచ్చేరి ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న మోదీని చెన్నైకికూడా రప్పించాలని ఎన్‌డీఏ నేతలు సన్నాహాలు చేపట్టారు.

3న చెన్నైకి ప్రధాని మోదీ?

చెన్నై: భారత ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్‌ 3న చెన్నై రానున్నట్లు తెలిసింది. ఆ రోజు పుదుచ్చేరి ఎన్నికల ప్రచారం కోసం వస్తున్న మోదీని చెన్నైకికూడా రప్పించాలని ఎన్‌డీఏ నేతలు సన్నాహాలు చేపట్టారు. ప్రధాని పర్యటనలో చెన్నై(Chennai)లో భారీ బహిరంగ సభనిర్వహించాలని కూడా కూటమి నేతలు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇప్పటికే ప్రధాని జనవరి 23న చెంగల్పట్టు జిల్లా మధురాంతకంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఈ నెల 1న మదురై వచ్చిన ప్రధాని.. తిరుప్పరంగుండ్రం మురుగన్‌ ఆలయంలో పూజలు చేసి,. అదే రోజు పుదుచ్చేరిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.


nani2.2.jpgఈ నేపథ్యంలో ప్రధాని ఈ నెల 3న పుదుచ్చేరికి వచ్చి, కేరళ ప్రచారానికి వెళ్లేలా పర్యటన ఖరారైంది. అయితే అదే రోజు చెన్నైకి కూడా మోదీని రప్పించేలా ఎన్‌డీఏ కూటమి నేతలు ప్రయత్నాలు చేపట్టారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశముందని బీజేపీ(BJP) వర్గాలు తెలిపాయి. ఈలోపు తమఅభ్యర్థుల పేర్లు ఖరారు చేయాలని ఎన్‌డీఏ కూటమిలోని పార్టీలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

చిత్తూరు- బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

విజయవాడ రైల్వేస్టేషన్ రీడెవలప్‌మెంట్‌కు ఆటంకాలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 28 , 2026 | 12:44 PM