Share News

కాలేశ్వరం పాపం కేసీఆర్‌దే: కేంద్ర మంత్రి బండి సంజయ్

ABN , Publish Date - Mar 28 , 2026 | 10:52 AM

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి తెలంగాణ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారశైలి, కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యం, కవిత కొత్త పార్టీ, తాజా రాజకీయ పరిణామాలపై బండి సంజయ్ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాలేశ్వరం పాపం కేసీఆర్‌దే: కేంద్ర మంత్రి బండి సంజయ్
Kaleshwaram Project Controversy

హైదరాబాద్, మార్చి 28: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి తెలంగాణ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారశైలి, కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యం, కవిత కొత్త పార్టీ, తాజా రాజకీయ పరిణామాలపై బండి సంజయ్ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.


కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేసీఆర్ అతిపెద్ద ఇంజనీర్. టోపి పెట్టుకొని ప్రాజెక్టును డిజైన్ చేసింది ఆయనే. ఈ ప్రాజెక్టు కుంగిపోవడానికి, ప్రజా ధనం వృథా కావడానికి కేసీఆర్ నిర్ణయాలే కారణం. ప్రజలు ప్రతి విషయాన్నీ గమనించి సరైన నిర్ణయం తీసుకుంటున్నారు’ అని అన్నారు.


కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవడంలో అధికార ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష తెలంగాణ సమాజం తలదించుకునేలా ఉంది. ప్రజలు సైతం ఆయన భాషపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మరీ దిగజారిపోయి.. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఆయన వ్యవహార శైలి మార్చుకుంటే మంచిది’ అని అన్నారు.


తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడతారనే ప్రచారంపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..‘తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఇది సంకేతం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ స్థాపించే హక్కు కలిగి ఉంటారు. అది వారి వ్యక్తిగత, రాజకీయ స్వేచ్ఛకు సంబంధించింది. కవిత కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనను స్వాగతిస్తున్నాం’ అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మార్కెట్‌కు చమురు మంట

త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 28 , 2026 | 11:03 AM