Share News

నక్సలిజంపై పోరు.. మార్చి 30న కేంద్రం కీలక ప్రకటన

ABN , Publish Date - Mar 28 , 2026 | 11:38 AM

భారతదేశ అంతర్గత భద్రతకు దశాబ్దాలుగా సవాలుగా మారిన నక్సలిజం సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేస్తోంది.

నక్సలిజంపై పోరు.. మార్చి 30న కేంద్రం కీలక ప్రకటన
Naxalism India News

ఇంటర్నెట్ డెస్క్: భారతదేశ అంతర్గత భద్రతకు దశాబ్దాలుగా సవాలుగా మారిన నక్సలిజం సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేస్తోంది. ఈ క్రమంలోన మార్చి 30న లోక్ సభలో నక్సలిజం నిర్మూలనపై ఒక చరిత్రాత్మక చర్చకు తెరలేవనుంది. దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ప్రభావాన్ని పూర్తిగా తుడిచి పెట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో ప్రకటించిన ‘మార్చి 2026’ గడుపు సమీపిస్తున్న నేపథ్యంలో, ఈ చర్చ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.


లోక్‌సభలో రూల్ 193 కింద ఈ స్వల్పకాలిక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ఈ చర్చను ప్రారంభించనున్నారు. దేశ వ్యాప్తంగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సభ దృష్టికి తీసుకురానున్నారు. కేవలం ఆపరేషన్‌లే కాకుండా, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్, విద్య, వైద్య సదుపాయాల కల్పన ద్వారా ప్రజలకు ఎలాంటి సేవలందిస్తున్నారన్న అంశంపై సుదీర్ఘ చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

మార్కెట్‌కు చమురు మంట

త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 28 , 2026 | 11:44 AM